Riyan Parag's YouTube History Leaked: రియాన్ పరాగ్‌... గత సీజన్‌లో ఐపీఎల్ ఆడినా పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ కసితో ఆడాడో లేకుంటే తనకున్న టాలెంట్‌ను చూపించాడో తెలియదు కానీ ఐపీఎల్‌ 2024లో మాత్రం దుమ్ములేపాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది కానీ... యూట్యూబ్ సెర్చ్‌ మాత్రం పరాగ్‌ పరువు తీసిన స్టేడియంలో పెట్టేసింది. 


ఫ్యాన్స్‌తో చేసిన యూట్యూబ్‌ లైవ్‌ ఇప్పుడు రియాన్ పరాగ్‌ కు పెద్ద పరేషాన్ అయిపోయింది. ఫ్యాన్స్‌తో మాట్లాడుతున్న టైంలో ఇష్టమైన పాట ఏది అని యూట్యూబ్ సెర్చ్‌లోకి వెళ్లాడు. అంతే అందులో సెర్చ్ చేసిన వీడియోలు హిస్టరీ కనిపించింది. ఆ హిస్టరీలో సారా అలీఖాన్ హాట్, అనన్య పాండ్య హాట్‌ అని సెర్చ్ చేసిన విషయాన్ని నెటిజన్లు గుర్తించారు. 






అతే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దొరికింది ఛాన్స్ అన్నట్టు నెటిజన్లు ఆయనపై ట్రోల్స్‌ చేస్తున్నారు. వివిధ సినిమాల్లో ఉన్న క్లిపింగ్స్ జత చేసి కొందరు... ఏఐ ద్వారా జనరేట్ చేసిన వీడియోలును మరికొందరు షేర్  చేస్తూ రియాగ్‌ను చెడుగుడు ఆడేస్తున్నారు. 


దీన్ని సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు. కుర్రతనంలో చేసిన ఇలాంటివి పెద్దగా పెట్టించుకోవద్దని హితవుపలుకుతున్నారు. తెలియక చేసిన పనిని ఇంతలా ట్రోల్ చేసి ఆటగాడిని కించపరచడం మంచికాదని అంటున్నారు. 










ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడిన రియాన్‌ పరాగ్‌ తన బ్యాటింగ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. 15 మ్యాచ్‌లు ఆడిన రియాన్ పరాగ్‌ నాలుగు హాఫ్‌ సెంచరీలు చేశాడు. టోర్నీ మొత్తంలో 573 పరుగులు చేసి ది బెస్ట్ అనిపించుకున్నాడు. అతను ఆడిన ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను ప్లేఆఫ్ వరకు తీసుకొచ్చాడు.