Rishabh Pant out from IPL 2023: భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదం కారణంగా డెహ్రాడూన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఐపీఎల్ తదుపరి సీజన్‌లో రిషబ్ పంత్ ఆడకపోవచ్చని వార్తలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
డేవిడ్ వార్నర్ సమర్థుడే...
రూర్కీలో జరిగిన కారు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. నివేదికల ప్రకారం, అతను ఇకపై IPL తదుపరి సీజన్‌లో ఆడే అవకాశం లేదు. పంత్ గాయంపై BCCI సీనియర్ అధికారి మాట్లాడుతూ 'అతనికి ఇప్పుడే ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఇప్పుడు ఏదైనా చెప్పడం చాలా తొందరగా మాట్లాడినట్లు అవుతుంది. అతను విశ్రాంతి తీసుకొని ఆరోగ్యంగా బయటకు రావాలి. అతను కోలుకున్న తర్వాత అన్ని పరీక్షలు జరిగిన తర్వాత, అతను NCAకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.’ అన్నారు
వైద్యులు తెలుపుతున్న దాని ప్రకారం అతను ఆరు నెలల పాటు విశ్రాంతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అతని గాయం ఇంకా పూర్తిగా సమీక్షించలేదని అతను చెప్పారు. సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతామన్నారు. బీసీసీఐ వైద్య బృందం కూడా అక్కడి వైద్యులతో టచ్‌లో ఉంది.
రిషికేశ్ ఎయిమ్స్ క్రీడా గాయాల విభాగం అధిపతి డాక్టర్ కమర్ అజామ్ మాట్లాడుతూ, 'పంత్ కోలుకోవడానికి కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చు. అతని స్నాయువు గాయం మరింత ప్రాణాంతకం అయితే, కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.’ అన్నారు.
డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్సీ చేయవచ్చు
డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. పృథ్వీ షా, మనీష్ పాండే, మిచెల్ మార్ష్‌లు కూడా కెప్టెన్సీకి ఎంపికయ్యారు. అయితే వీటిలో వార్నర్‌దే పైచేయి. ఎందుకంటే అతను చాలా కాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అదే సమయంలో అతని కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఛాంపియన్‌గా నిలిచింది. అటువంటి పరిస్థితిలో కెప్టెన్సీ సుదీర్ఘ అనుభవం దృష్ట్యా వార్నర్ కొత్త కెప్టెన్ కావడం ఖాయం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడవచ్చు.