ఇండియన్‌ ప్రీమియర్‌ లీగును ముంబయిలోనే నిర్వహించాలని బీసీసీఐ దాదాపుగా నిర్ణయించుకుంది. కరోనా పరిస్థితి మరింత మెరుగుపడితే అభిమానులను అనుమతించే విషయాన్నీ ఆలోచిస్తోందని తెలిసింది. బయో బుడగకు ఎలాంటి ఇబ్బందులు రాకుంటేనే ఆ దిశగా అడుగులు వేయనుంది. కీలకమైన ప్లేఆఫ్‌ పోటీలకు మాత్రం అహ్మదాబాద్‌లోని మొతేరాను వేదికగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


సరికొత్త సీజన్‌కు దాదాపుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మార్చి ఆఖరి వారం నుంచే పోటీలు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంతకు ముందే ముంబయి లీగుకు ఆతిథ్యం ఇస్తుందని వార్తలు వచ్చాయి. బీసీసీఐ వీటిని ఇంకా ధ్రువీకరించలేదురు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలోనే లీగు నిర్వహించాలని మాత్రం పట్టుదలగా ఉంది. 'అవును, సీసీఐకి ఐపీఎల్‌ వస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాచులకు ఆతిథ్య ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని సీసీఐ అధ్యక్షుడు ప్రేమల్‌ ఉదాని అంటున్నారు.


Also Read: Ashleigh Barty: ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ 44 సంవత్సరాల తర్వాత చరిత్ర.. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా యాష్లే!


Also Read: David Warner Daughter: డేవిడ్ వార్నరే కాదు తన కూతురు కూడా.. ‘తగ్గేదే లే’!


ముంబయి నగరాన్నే వేదికగా ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన స్టేడియాలు మూడు ఉన్నాయి. వాంఖడే ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. 25 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు నిర్వహించారు. ఇక ప్రతి సీజన్లో ఐపీఎల్‌ మ్యాచులు జరుగుతుంటాయి. డీవై పాటిల్‌ స్టేడియంలోనూ నిరంతరం మ్యాచులు నిర్వహిస్తుంటారు. క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా స్టేడియాన్ని బ్రబౌర్న్‌గా పిలుస్తారు. ఇక్కడ 18 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు జరిగాయి. ఇక ముంబయిలో ఫైవ్‌ స్టార్ హోటళ్లూ, విల్లాలూ ఎక్కువే. ప్రత్యేకంగా బయో బుడగలను ఏర్పాటు చేయొచ్చు. అందుకే ముంబయికే బీసీసీఐ ప్రాధాన్యం ఇస్తోంది.


మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేస్తుండటంతో అభిమానులకు అనుమతినిచ్చే విషయాన్ని బీసీసీఐ ఆలోచిస్తోంది. క్రీడా స్టేడియాల్లోకి 25 శాతం మంది అనుమతి ఇవ్వనుందని తెలిసింది. 'ఈ ఏడాది కొవిడ్‌ కేసులు ఎక్కువగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాలు ఈ ఐపీఎల్‌కు 25 శాతం అభిమానులకు అనుమతి ఇవ్వొచ్చు' అని ఓ రాజకీయ నేత అంటున్నారు. 'మార్గనిర్దేశాల ప్రకారం 50 శాతం మందిని అనుమతించొచ్చు. అంటే కార్పొరేట్‌ బాక్సులు, ప్రెస్‌ బాక్స్‌లోనే 50 శాతం వరకు నిండుతారు' అని పేర్కొన్నారు.