ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ పోటీ పడనుంది. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ ఆరో స్థానంలో ఉండగా, ముంబై ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు గెలుపు తప్పనిసరి. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం కూడా ఉంది. మ్యాచ్ గెలవడంతో పాటు ఈ రెండు జట్లు నెట్‌రన్‌రేట్ మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.
గత మ్యాచ్‌లో ఫాంలో ఉన్న చెన్నైపై గెలిచి రాజస్తాన్ మంచి ఊపు మీదుంది. 190 పరుగులను కేవలం 17.3 ఓవర్లలోనే ఛేదించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్ మంచి ఫాంలో ఉన్నారు. దీంతోపాటు శివం దూబే కూడా టచ్‌లోకి రావడం రాజస్తాన్‌కు కచ్చితంగా ఆనందాన్నిచ్చే అంశమే. అయితే ముంబై బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది కాబట్టి రాజస్తాన్ జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు చేతన్ సకారియా, ముస్తాఫిజుర్, మయాంక్ మార్కండేలతో రాజస్తాన్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది.
ఇక ముంబై విషయానికి వస్తే.. ఆ జట్టుకి, వాళ్ల ఫాంకి అస్సలు సంబంధం లేదు. యూఏఈలో ఐదు మ్యాచ్‌ల్లో ఆడితే అందులో నాలుగు ఓడిపోవడం ముంబైని నిరాశపరిచే అంశం. ముంబై ఇండియన్స్ బౌలింగ్ బాగానే ఉన్నా.. బ్యాటింగ్‌లో ఎవరూ ఫాంలో లేరు. రోహిత్, డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా అందరూ ఈ ఐపీఎల్‌లో నిరాశపరిచారు. ఈ కీలక మ్యాచ్‌లో వీరందరూ బాగా ఆడి జట్టుకు భారీ విజయాన్ని అందిస్తే ప్లేఆఫ్స్‌కు వెళ్లే చాన్సెస్ మెరుగవుతాయి. ఇక ముంబై బౌలింగ్ మాత్రం బాగానే ఉంది. బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్‌లు పరుగులు కట్టడి చేస్తూ.. అవసరమైన సమయంలో వికెట్లు కూడా తీస్తున్నారు.
ఈ రెండు జట్లూ ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వీటిలో ముంబై 12 మ్యాచ్‌ల్లో గెలవగా.. రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరో తెలసుకోవాలంటే సాయంత్రం దాకా ఆగాల్సిందే..
Also Read: 'దారి తప్పిన పరుగుల వరద' : ఓడిన మ్యాచుల్లో టాప్ స్కోరర్లు వీరే!
రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు(అంచనా)
ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శామ్సన్(కెప్టెన్, వికెట్ కీపర్), శివం దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ టెవాటియా, ఏ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ముంబై ఇండియన్స్ తుదిజట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్‌నైల్, జయంత్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
Also Read: చితక బాదుడు 'సీక్రెట్' చెప్పిన మాక్సీ! బెంగళూరు అలా చెప్పడం వల్లే!
Also Read: పంజాబ్ పాత కథే! విజయానికి చేరువై బోల్తా! ప్లేఆఫ్స్ చేరిన కోహ్లీసేన