19.5 ఓవర్లలో కోల్‌కతా స్కోరు 136-7, మూడు వికెట్లతో విజయం
రవి చంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయినా ఐదో బంతికి సిక్సర్ కొట్టి రాహుల్ త్రిపాఠి కోల్‌కతాను గెలిపించాడు.


-------


19 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 129-5, లక్ష్యం 136 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి బంతికి ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 5(9)
ఆన్రిచ్ నోర్జే 4-0-31-2
ఇయాన్ మోర్గాన్ (బి) నోర్జే (0: 3 బంతుల్లో)


-----


18 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 126-4, లక్ష్యం 136 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆఖరి బంతికి దినేష్ కార్తీక్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 12 బంతుల్లో 10 పరుగులు కావాలి.
ఇయాన్ మోర్గాన్ 0(0)
రాహుల్ త్రిపాఠి 2(6)
కగిసో రబడ 4-0-23-2
దినేష్ కార్తీక్ (బి) రబడ (0: 3 బంతుల్లో)


------


17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 125-3, లక్ష్యం 136 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 11 పరుగులు కావాలి.
దినేష్ కార్తీక్ 0(2)
రాహుల్ త్రిపాఠి 1(1)
ఆవేష్ ఖాన్ 4-0-22-1
శుభ్‌మన్ గిల్ (సి) పంత్ (బి) ఆవేష్ ఖాన్ (46: 46 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)


--------


16 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 123-2, లక్ష్యం 136 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి నితీష్ రాణా అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 24 బంతుల్లో 13 పరుగులు కావాలి.
శుభ్‌మన్ గిల్ 45(43)
ఆన్రిచ్ నోర్జే 3-0-20-0
నితీష్ రాణా (సి) హెట్‌మేయర్ (బి) నోర్జే (13: 12 బంతుల్లో, ఒక సిక్సర్)


--------


15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 113-1, లక్ష్యం 136 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 30 బంతుల్లో 23 పరుగులు కావాలి.
నితీష్ రాణా 11(9)
శుభ్‌మన్ గిల్ 37(40)
ఆవేష్ ఖాన్ 3-0-20-0


-------


14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 108-1, లక్ష్యం 136 పరుగులు
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 36 బంతుల్లో 28 పరుగులు కావాలి.
నితీష్ రాణా 9(6)
శుభ్‌మన్ గిల్ 34(37)
అక్షర్ పటేల్ 4-0-32-0


------


13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 98-1, లక్ష్యం 136 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ అవుటయ్యాడు. కోల్‌కతా విజయానికి 42 బంతుల్లో 44 పరుగులు కావాలి.
నితీష్ రాణా 1(3)
శుభ్‌మన్ గిల్ 32(34)
కగిసో రబడ 3-0-22-1
వెంకటేష్ అయ్యర్ (సి) స్టీవ్ స్మిత్ (బి) రబడ (55: 41 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)


--------


12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 92-0, లక్ష్యం 136 పరుగులు
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. వెంకటేష్ అయ్యర్ అర్థ సెంచరీ పూర్తయింది. కోల్‌కతా విజయానికి 48 బంతుల్లో 44 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 51(39)
శుభ్‌మన్ గిల్ 31(33)
అక్షర్ పటేల్ 3-0-22-0


--------


11 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 88-0, లక్ష్యం 136 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 54 బంతుల్లో 48 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 49(37)
శుభ్‌మన్ గిల్ 29(29)
ఆన్రిచ్ నోర్జే 2-0-18-0


-------


10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 76-0, లక్ష్యం 136 పరుగులు
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మొదటి బంతికే వెంకటేష్ అయ్యర్ సిక్సర్ కొట్టాడు. కోల్‌కతా విజయానికి 60 బంతుల్లో 60 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 44(33)
శుభ్‌మన్ గిల్ 27(27)
అక్షర్ పటేల్ 2-0-18-0


--------


తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 67-0, లక్ష్యం 136 పరుగులు
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 66 బంతుల్లో 69 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 37(29)
శుభ్‌మన్ గిల్ 26(25)
రవిచంద్రన్ అశ్విన్ 3-0-20-0


--------


ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 61-0, లక్ష్యం 136 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 72 బంతుల్లో 75 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 35(26)
శుభ్‌మన్ గిల్ 23(22)
కగిసో రబడ 2-0-16-0


-----


ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 56-0, లక్ష్యం 136 పరుగులు
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 78 బంతుల్లో 80 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 33(24)
శుభ్‌మన్ గిల్ 20(18)
రవిచంద్రన్ అశ్విన్ 2-0-14-0


------


పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 51-0, లక్ష్యం 136 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 84 బంతుల్లో 85 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 31(20)
శుభ్‌మన్ గిల్ 17(16)
ఆవేష్ ఖాన్ 2-0-15-0


-------


ఐదు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 42-0, లక్ష్యం 136 పరుగులు
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మూడో బంతికి వెంకటేష్ అయ్యర్ భారీ సిక్సర్ కొట్టాడు. కోల్‌కతా విజయానికి 90 బంతుల్లో 94 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 23(16)
శుభ్‌మన్ గిల్ 16(14)
అక్షర్ పటేల్ 1-0-11-0


-------


నాలుగు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 30-0, లక్ష్యం 136 పరుగులు
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. మూడో బంతికి వెంకటేష్ అయ్యర్ భారీ సిక్సర్ కొట్టాడు. కోల్‌కతా విజయానికి 96 బంతుల్లో 106 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 17(13)
శుభ్‌మన్ గిల్ 13(11)
అక్షర్ పటేల్ 1-0-9-0


-----


మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 21-0, లక్ష్యం 136 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 102 బంతుల్లో 115 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 10(10)
శుభ్‌మన్ గిల్ 11(8)
ఆవేష్ ఖాన్ 1-0-6-0


-----


రెండు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 15-0, లక్ష్యం 136 పరుగులు
రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 108 బంతుల్లో 121 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 8(8)
శుభ్‌మన్ గిల్ 7(4)
రవిచంద్రన్ అశ్విన్ 1-0-9-0


-----


మొదటి ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 6-0, లక్ష్యం 136 పరుగులు
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. కోల్‌కతా విజయానికి 114 బంతుల్లో 130 పరుగులు కావాలి.
వెంకటేష్ అయ్యర్ 1(4)
శుభ్‌మన్ గిల్ 5(2)
ఆన్రిచ్ నోర్జే 1-0-6-0


-----


20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 135-5, కోల్‌కతా లక్ష్యం 136 పరుగులు
శివం మావి వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఓవర్ రెండో బంతికి బౌండరీ, చివరి బంతికి సిక్సర్‌ను శ్రేయస్ అయ్యర్ సాధించాడు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 136 పరుగులు కావాలి.
అక్షర్ పటేల్ 4(4)
శ్రేయస్ అయ్యర్ 30(27)
శివం మావి 4-0-27-1


------


19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 120-5
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. హెట్‌మేయర్ అవుటయ్యాడు.
అక్షర్ పటేల్ 1(1)
శ్రేయస్ అయ్యర్ 17(23)
సునీల్ నరైన్ 4-0-27-0
హెట్‌మేయర్ (రనౌట్ వెంకటేష్ అయ్యర్/దినేష్ కార్తీక్)  (17: 10 బంతుల్లో, రెండు సిక్సర్లు)


-----


18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 114-4
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. హెట్‌మేయర్ రెండు సిక్సర్లు కొట్టాడు.
హెట్‌మేయర్ 17(9)
శ్రేయస్ అయ్యర్ 15(20)
లోకి ఫెర్గూసన్ 4-0-26-1


-----


17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 99-4
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
హెట్‌మేయర్ 4(6)
శ్రేయస్ అయ్యర్ 13(17)
వరుణ్ చక్రవర్తి 4-0-26-2


------


16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 92-4
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. రిషబ్ పంత్ అవుటయ్యాడు.
హెట్‌మేయర్ 1(3)
శ్రేయస్ అయ్యర్ 10(13)
లోకి ఫెర్గూసన్ 3-0-11-1
రిషబ్ పంత్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) లోకి ఫెర్గూసన్ (6: 6 బంతుల్లో, ఒక ఫోర్)


-------


15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 90-3
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఓవర్ మొదటి బంతికే శిఖర్ ధావన్ అవుటయ్యాడు. నాలుగో బంతికి పంత్ బౌండరీ కొట్టాడు.
రిషబ్ పంత్ 6(4)
శ్రేయస్ అయ్యర్ 9(12)
వరుణ్ చక్రవర్తి 3-0-19-2
శిఖర్ ధావన్ (సి) షకీబ్ అల్ హసన్ (బి) వరుణ్ చక్రవర్తి (36: 39 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు)


-----


14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 83-2
శివం మావి వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 
శిఖర్ ధావన్ 36(38)
శ్రేయస్ అయ్యర్ 8(11)
శివం మావి 3-0-12-1


------


13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 77-2
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 
శిఖర్ ధావన్ 34(36)
శ్రేయస్ అయ్యర్ 4(7)
షకీబ్ అల్ హసన్ 4-0-27-0


-----


12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 73-2
శివం మావి వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. మూడో బంతికి స్టాయినిస్ క్లీన్ బౌల్డయ్యాడు.
శిఖర్ ధావన్ 32(34)
శ్రేయస్ అయ్యర్ 2(3)
శివం మావి 2-0-6-1
మార్కస్ స్టాయినిస్ (బి) శివం మావి (18: 23 బంతుల్లో, ఒక ఫోర్)


----


11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 70-1
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి.
శిఖర్ ధావన్ 31(32)
మార్కస్ స్టాయినిస్ 18(22)
సునీల్ నరైన్ 3-0-22-0


------


10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 65-1
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మూడో బంతికి ధావన్ బౌండరీ సాధించాడు.
శిఖర్ ధావన్ 29(30)
మార్కస్ స్టాయినిస్ 15(18)
వరుణ్ చక్రవర్తి 2-0-12-1


-------


9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 55-1
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
శిఖర్ ధావన్ 21(26)
మార్కస్ స్టాయినిస్ 13(16)
సునీల్ నరైన్ 2-0-17-0


------


8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 52-1
శివం మావి వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి.
శిఖర్ ధావన్ 20(22)
మార్కస్ స్టాయినిస్ 11(14)
శివం మావి 1-0-3-0


-----


ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 49-1
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. రెండో బంతికి స్టాయినిస్ బౌండరీ సాధించాడు.
శిఖర్ ధావన్ 19(21)
మార్కస్ స్టాయినిస్ 10(9)
షకీబ్ అల్ హసన్ 3-0-24-0


-----


పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 38-1
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
శిఖర్ ధావన్ 17(19)
మార్కస్ స్టాయినిస్ 3(5)
లోకి ఫెర్గూసన్ 2-0-9-0


-------


ఐదు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 34-1
వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. మొదటి బంతికే పృథ్వీ షా అవుటయ్యాడు.
శిఖర్ ధావన్ 15(15)
మార్కస్ స్టాయినిస్ 1(3)
వరుణ్ చక్రవర్తి 1-0-2-1
పృథ్వీ షా (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ చక్రవర్తి (18: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్)


------


నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 32-0
సునీల్ నరైన్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. శిఖర్ ధావన్ రెండు సిక్సర్లు కొట్టాడు.
శిఖర్ ధావన్ 14(13)
పృథ్వీ షా 18(11)
సునీల్ నరైన్ 1-0-14-0


------


మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 18-0
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఓవర్లో మొదటి రెండు బంతులకు పృథ్వీ షా సిక్సర్, ఫోర్ కొట్టారు.
శిఖర్ ధావన్ 1(8)
పృథ్వీ షా 17(10)
షకీబ్ అల్ హసన్ 2-0-13-0


------


రెండు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 6-0
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి.
శిఖర్ ధావన్ 0(7)
పృథ్వీ షా 6(5)
లోకి ఫెర్గూసన్ 1-0-5-0


-----


మొదటి ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 1-0
షకీబ్ అల్ హసన్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.
శిఖర్ ధావన్ 0(4)
పృథ్వీ షా 1(2)
షకీబ్ అల్ హసన్ 1-0-1-0


--------


ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, ఆవేష్ ఖాన్, ఆన్రిచ్ నోర్జే


కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
శుభ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లోకి ఫెర్గూసన్, శివం మావి, వరుణ్ చక్రవర్తి


--------


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నైట్‌రైడర్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.


-------


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతోంది. ఈ రెండు జట్లు 27సార్లు తలపడగా కేకేఆర్‌ 15 సార్లు గెలిచింది. అయితే చివరిసారిగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో మూడు సార్లు గెలిచి ఢిల్లీ ఆధిపత్యం చలాయించింది. 


ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అన్ని వనరులు ఉన్నాయి. ఏ మ్యాచునైనా గెలవగల సత్తా ఆ  జట్టుకుంది. కానీ ఫ్లేఆఫ్స్‌ మ్యాచులను ఎలా గెలవాలో ఇంకా అనుభవం రాలేదు. పెద్ద మ్యాచులను గెలిచే సామర్థ్యం తమకుందని మానసికంగా బలంగా నమ్మకపోవడమే అందుకు కారణం. చెన్నైతో తొలి క్వాలిఫయర్‌లోనూ ఇదే కనిపించింది. పేస్‌ను ఎదుర్కోలేకపోతున్న ధోనీకి ఆఖరి ఓవర్లో రబడతో బౌలింగ్‌ చేయిస్తే ఫలితం మరోలా ఉండేదేమో! రెండో క్వాలిఫయర్‌లో కేకేఆర్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సింది కేవలం ఆత్మవిశ్వాసం, గెలుస్తామన్న నమ్మకమే!


ఈ సీజన్‌ తొలి అంచెలో ఓటములు ఎదుర్కొన్న కోల్‌కతా దుబాయ్‌కి వచ్చాక రూటు మార్చింది. ఒకప్పటి గంభీర్‌ నాయకత్వంలోని దూకుడు మళ్లీ కనిపిస్తోంది. కెప్టెన్‌ మోర్గాన్‌ ఫామ్‌లో లేకున్నా విజయాలు సాధిస్తుండటం దాన్నే సూచిస్తోంది. పవర్‌ప్లేలో ప్రత్యర్థిని చితక్కొట్టడమే కేకేఆర్‌ లక్ష్యం. నితీశ్‌ రాణా టార్చ్‌బేరర్‌లా నిలకడగా ఆడుతూ వికెట్లను కాపాడుతున్నాడు. మిగతావాళ్లు దంచేస్తున్నారు. ఇక సునిల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తిని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. పైగా నరైన్‌పై ఢిల్లీ టాప్‌, మిడిలార్డర్‌కు మెరుగైన రికార్డు లేదు. ఫెర్గూసన్‌తో పాటు కుర్ర పేసర్లూ దడదలాడిస్తున్నారు. మానసికంగా బలంగా కనిపిస్తున్న కేకేఆర్‌ను ఓడించడం ఢిల్లీకి అంత సులువేం కాదు.