న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఊపులో టెస్టు సిరీస్‌కు కూడా సిద్ధం అవుతుంది. సన్నాహాల్లో సరదాలు అన్నట్లు.. టీమిండియా జట్టులోని ఆటగాళ్లు ఒకళ్లని ఒకళ్లు ఆటపట్టించుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన సరదా సంఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఆ వీడియోలో ఏముందో కింద చూసేయండి.






వీడియో చూశారుగా.. పాపం శ్రేయస్ అయ్యర్ దెబ్బకి మహ్మద్ సిరాజ్ కార్డు ముక్క కూడా కింద పడేశాడు. మొదట శ్రేయస్ అయ్యర్ చూపించిన కార్డుల్లోంచి సిరాజ్ స్పేడ్ 4ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ముక్కని మళ్లీ శ్రేయస్.. సిరాజ్‌కే ఇచ్చేశాడు. అయితే తర్వాత వేరే కార్డుతో సిరాజ్ చేతి మీద అయ్యర్ రుద్దినప్పుడు కార్డులు మారిపోవడంతో సిరాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు.


ఈ వీడియోలో కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లను కూడా మనం చూడవచ్చు. న్యూజిలాండ్‌తో ఆడాల్సిన జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ ముగ్గురూ ఉన్నారు. అంటే ఒకవైపు ప్రాక్టీసు చేసుకుంటూనే ఖాళీ దొరికనప్పుడు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారన్న మాట.


టీ20 సిరీస్ తరహాలోనే టెస్టు సిరీస్‌ను కూడా టీమిండియా గెలిస్తే.. సిరీస్‌లో పరిపూర్ణంగా మనమే ఆధిపత్యం సాధించినట్లు అవుతుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ నవంబర్ 25వ తేదీ నుంచి జరగనుంది. టీ20లకు విశ్రాంతి తీసుకున్న కేన్ విలియమ్సన్ టెస్టులకు బరిలోకి దిగనున్నాడు.


మరోవైపు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ జట్టులో లేకపోవడంతో అజింక్య రహానేకు కెప్టెన్సీ అవకాశం దక్కింది. తెలుగు తేజం శ్రీకర్ భరత్ కూడా 15 మందితో కూడిన జట్టులో ఉన్నాడు. అయితే వికెట్ కీపర్ స్థానం మాత్రం సాహాకే దక్కే అవకాశం ఉంది.


భారత్ బృందం
అజింక్య రహానే(కెప్టెన్), చటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, ఉమేష్ యాదవ్


న్యూజిలాండ్ బృందం
హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, విల్ యంగ్, డేరిల్ మిషెల్, రచిన్ రవీంద్ర, మిషెల్ శాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), టామ్ లాథమ్(వికెట్ కీపర్), అజాజ్ పటేల్, కైల్ జేమీసన్, నీల్ వాగ్నర్, టిమ్ సౌతీ, విల్ సోమర్‌విల్లే


Also Read: Ind vs NZ- 3rd T20, Full Match Highlight: న్యూజిలాండ్‌ను ఉతికేశారు.. 3-0తో సిరీస్ సాధించిన టీమిండియా!


Also Read: Ian Chappell on T20 WC: ప్రపంచకప్‌ టాస్‌ గెలువు కప్పు కొట్టుగా మారిందన్న ఇయాన్‌ ఛాపెల్‌..!


Also Read: Jeremy Solozano Injured: క్రికెట్‌ మైదానంలో విషాదం..! విండీస్‌ ఫీల్డర్‌ తలకు తగిలిన బంతి.. స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి