అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం 'బంగార్రాజు'. కొన్నేళ్లక్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి ఇది ప్రీక్వెల్. అయితే ఈ సినిమా నుంచి నాగచైతన్య ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నాగార్జున ఈ లుక్ ను షేర్ చేస్తూ.. 'బంగార్రాజు ఫస్ట్ లుక్' అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఈ సినిమాలో నాగచైతన్య పోషించే పాత్ర పేరు 'బంగార్రాజు' అన్నమాట. కానీ అందరూ నాగార్జునను 'బంగార్రాజు'గా అనుకుంటున్నారు. కానీ చైతు అని క్లారిటీ వచ్చింది.
Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..
ఇక ఈ సినిమా టీజర్ ను రేపు(నవంబర్ 23) ఉదయం 10:23 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న చైతు ఇక టీజర్ లో ఎంత హంగామా చేసి ఉంటారో..! ఈ సినిమాలో చైతూకి జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. ఇందులో ఆమె నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది. రీసెంట్ గానే కృతి లుక్ ను కూడా విడుదల చేశారు.
దాదాపు నాలుగేళ్లపాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలనేది ప్లాన్. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ.. చిత్రబృందం మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేసేసింది. ఇప్పటికే సినిమా నుంచి ‘లడ్డుండా’ అనే పాటను విడుదల చేశారు.