IND VS SL: శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో రెండో టీ20 నేడు (ఫిబ్రవరి 26వ తేదీ) జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రెండో టీ20లో మొదట శ్రీలంక బ్యాటింగ్‌కు దిగనుంది.


భారత్ తన తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్టే... ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగనుంది. ఇక శ్రీలంక మాత్రం తన జట్టుకు రెండు మార్పులు చేసింది. జనిత్ లియనగే, జెఫ్రే వాండర్సే స్థానాల్లో బినుర ఫెర్నాండో, దనుష్క గుణతిలకలకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే... సిరీస్‌ను కూడా 2-0తో గెలుస్తుంది.


భారత్ తుదిజట్టు (India Playing XI)
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజు శామ్సన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్


శ్రీలంక తుదిజట్టు(Srilanka Playing XI)
పతుం నిశ్శంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణ రత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినురా ఫెర్నాండో, లహిరు కుమర