వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రావడంలేద .. చేసిన పనులు డబ్బులు రాక అవస్థలు పడుతున్నారని కొంత కాలంగా విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. అందుకే కొత్తగా చేపట్టే పనులకు ఎవరూ ముందుకు రావడంలేదనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేనే ( YSRCP MLA ) తమ హయాంలో బిల్లులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ( KOVUR MLA ) ఈ విషయంలో కాస్త ఆవేశపడ్డారు.  కోవూరులో రెండున్నరేళ్ల నుంచి బిల్లులు రావడంలేదని, దాదాపు రూ. 45 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. 


ఉగాదే ముహుర్తం - ఏపీలో కొత్త కేబినెట్ ఖాయం !?


అయితే కోవూరు ఎమ్మెల్యే రాజకీయం బాగా వంట బట్టించుకున్నారు. అందుకే ఈ అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్నట్లుగా కాకుండా విభిన్న అంశానికి జోడించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు కోవూరు ( Kovur ) మండలాల్లో వివిధ ప్రభుత్వ పథకాలు, పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారంతా నల్లపురెడ్డి ( Nallapu reddy ) అనుచరులు కావడంతో ఎమ్మెల్యేకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలా అవినీతికి అలవాటు పడ్డ నాయకులు వార్నింగ్ ఇచ్చేలా ఓ కార్యక్రమలో మాట్లాడారు. 


కేసీఆర్ వీరాభిమానులుగా పవన్ ఫ్యాన్స్ ! కానీ యాంటీ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా ?


అయితే ఆయన చెప్పాలనుకున్నదేమో కానీ బిల్లులు ( Bills ) రావడం లేదన్నది మాత్రం హైలెట్ అయింది. అసలు నల్లపురెడ్డి ఏం చెప్పాలనుకున్నారంటే  బిల్లులు రాక వైఎస్ఆర్‌సీపీ  నాయకులు, కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారే కానీ, అవినీతికి ( Corruption )  పాల్పడటంలేదని చెప్పారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని లంచాలకు అలవాటు పడిన నాయకులకు నల్లపురెడ్డి హితవు పలికారు. తను పాల్గొన్న సమావేశంలో ఓ నాయకుడు పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడితే పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు. 
 
ఏపీలో  వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించడం ఎమ్మెల్యేలకు తలకు మించిన భారం అవుతోంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఒకరిద్దరు బయటకు చెబుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అదే చెప్పారు... ఇప్పుడు ఆయన  బాటలోకి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వచ్చి చేరారు.  వీరి బాధను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ అలకిస్తుందో లేదో మరి !