IND vs ZIM ODI Live Streaming: జింబాబ్వే సిరీసును టీమ్‌ఇండియా విజయంతో ఆరంభించింది. తొలి వన్డేలో ప్రత్యర్థి నిర్దేశించిన సులభ లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. శనివారం కీలకమైన రెండో పోరుకు సిద్ధమమైంది. మరి ఈ మ్యాచ్‌ వేదిక, లైవ్‌ టెలికాస్ట్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, అంచనా జట్ల వివరాలు మీ కోసం!


When Does India vs Zimbabwe 2nd ODI match Begin (Date and Time in India)?


భారత్‌, జింబాబ్వే రెండో వన్డే వేదిక హారారేలోని హారారే స్పోర్ట్స్‌ క్లబ్‌. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 12:15 గంటలకు టాస్‌ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.


Where to Watch India vs Zimbabwe 2nd ODI match?


భారత్‌, జింబాబ్వే సిరీస్‌ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో మ్యాచ్‌ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్‌, సోనీ సిక్స్‌ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.


How to Watch India vs Zimbabwe 2nd ODI match Live Streaming Online for Free in India?


భారత్‌, జింబాబ్వే రెండో వన్డేను లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్‌ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.


India vs Zimbabwe ODI Series


భారత్‌, జింబాబ్వే వన్డే సిరీసు ఆగస్టు 18న మొదలైంది. ఆగస్టు 20 రెండు, 22న మూడో వన్డే ఉంటాయి. మొత్తం మ్యాచులన్నీ హారారేలోనే జరుగుతాయి.  


India vs Zimbabwe 2nd ODI ProbableXI


భారత్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, ఇషాన్‌ కిషన్‌, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్


జింబాబ్వే: తడివంశి మరుణి, ఇన్నోసెంట్‌ కైయా, సేన్‌ విలియమ్సన్‌, వెస్లీ మధెవెర్‌, సింకందర్‌ రజా, రెజిస్‌ చకబ్వా, రియాన్‌ బర్ల్‌, ల్యూక్‌ జాగ్వె, బ్రాడ్‌ ఇవాన్స్‌, విక్టర్‌ న్యౌచీ, రిచర్డ్‌ ఎంగరవ