IND vs WI, T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీసుకు ముంగిట టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది! ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరూ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. వారి స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad), దీపక్ హుడా (Deepak Hooda)ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
పిక్క కండరాలు పట్టేశాయి
విండీస్‌తో రెండో వన్డేకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యం అందించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఎడమకాలి పిక్క కండరాలు పట్టేశాయి. దాంతో అతడు మూడో వన్డేలో ఆడలేదు. ఇక అక్షర్ పటేల్ కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వీరిద్దరూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌కు వెళ్లనున్నారు.
మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు
మిడిలార్డర్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలిగే వారి కోసం టీమ్‌ఇండియా వెతుకుతోంది. అందుకే దీపక్ హుడాను తీసుకుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ సైతం జాతీయ జట్టుకు ఆడాలని ఎదురు చూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టాడు. భవిష్యత్తు దృష్ట్యా అతడికి చోటిచ్చింది.
టీమ్‌ఇండియా టీ20 జట్టు
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా
Also Read: అనుభవం లేని సమద్, ఉమ్రాన్‌కు సన్‌రైజర్స్ రూ.4 కోట్లు ఎందుకిస్తోంది! విలియమ్సన్‌ది సరైన ధరేనా?
Also Read: మీకిష్టమైన ఫ్రాంచైజీ పర్సులో ఎంత డబ్బుంది? ఏ ఆటగాళ్లు ఉన్నారంటే?