ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరల అంశంపై తుది నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వ కమిటీ సిద్ధమైంది. ఈ కమిటీ తుది సమావేశం పదిహేడో తేదీన అమరావతి సచివాలయంలో జరిగనుంది. ఈ మేరకు సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం పంపారు. ఇప్పటికే ఈ కమిటీ మూడు సార్లు సమావేశం అయింది. ఈ  భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హీరోలు చేసిన సిఫార్సులపై కమిటీ భేటీలో చర్చించనున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్‌ చిత్రాలు వంటి అంశాలపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పిస్తారు. 


చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులతో  జరిగిన సమావేశంలో సీఎం జగన్ పలు నిర్ణయాలు ప్రకటించారు.  పెద్ద సినిమాలకు ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు.హీరో, హీరోయిన్‌, దర్శకుడు పారితోషికం వంటి అంశాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారని.. అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలని అలాంటి సినిమాలకు వారం పాటు ధరల పెంచుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు.  ఐదో షో కూడా తీసుకురావాలని అడిగారని.. ఆ పాయింట్‌ను అర్థం చేసుకున్నామన్నారు. ఐదో ఆట వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని జగన్ వ్యాఖ్యానించారు.  


సీఎం జగన్ ప్రకటించిన ఇలాంటి వివరాలు కమిటీ నివేదికలో తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. అలాగే సినీ పరిశ్రమ వివిధ రకాల రాయితీలు కోరుతోంది. ప్రధానంగా 17 అంశాల పై కమిటీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  విజ‌య‌వాడ,  విశాఖ‌, తిరుప‌తి, క‌ర్నూలు వంటి ప్ర‌దాన న‌గ‌రాల్లో టిక్కెట్ ధర రూ.  135 ప్లస్ జీఎస్టీ గా ఉంటుందని భావిస్తున్నారు.  ఇక బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అన్నది కమిటీ నిర్ణయిస్తుంది.  గ‌తంలో రోజు కు 5షోలు వేయాల‌నే ప్ర‌తిప‌ద‌న ఉంది. వారంత‌రాలు, పండుగ‌లు, సీజ‌న్ లో రోజుకు 5షోలు వేసుకునేందుకు సీఎం జ‌గ‌న్ అంగీకారం తెలిపారు. దీన్ని కూడా నివేదికలో పొందు పరిచే అవకాశం ఉంది. 


ఇప్ప‌టికే మ‌ల్టి ప్లెక్స్ ల‌లో ఎలాగూ టిక్కెట్ ద‌ర‌లు,అదికంగా ఉన్నాయి.ఇక మిగిలిన దియేట‌ర్ల‌లో కూడ చిత్ర డిమాండ్ ను బ‌ట్టి టిక్కెట్ ద‌ర ఉండాల‌న్న ప్ర‌తిపాద‌న కూడ రెడీ అయ్యింది.ఇ ది కూడ దాదాపు ఖ‌రారు అయ్యింది. రోజుకు 5షోలు లైన్ క్లియ‌ర్ అయిన నేప‌ద్యంలో, పెద్ద సినిమాలకు టిక్కెట్ ల విష‌యంలో కూడ జ‌గ‌న్ సానుకూలంగా ఓకే చేశారు. కమిటీ నివేదిక ఇస్తే జగన్ దాన్ని ఆమోదించడమే మిగిలింది.