అరంగేట్రం చేసిన టీ20 మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఎనిమిదో భారతీయ ఆడగాడిగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ నిలిచాడు. రవి బిష్ణోయ్ వెస్టిండిస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ కాప్‌ను రవి బిష్ణోయ్... యుజ్వేంద్ర చాహల్ నుంచి అందుకున్నాడు.
ఈ 21 సంవత్సరాల యువ లెగ్ స్పిన్నర్ తన మొదటి అంతర్జాతీయ డెబ్యూ మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 4.25 ఎకానమీ రేటుతో 17 పరుగులను మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో తను రోస్టన్ చేజ్, రొవ్‌మన్ పావెల్‌లను అవుట్ చేశాడు.
మొదటి టీ20 మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఎనిమిది మంది భారతీయులు వీరే:
1. దినేష్ కార్తీక్ (ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, 2006)
2. ప్రగ్యాన్ ఓజా (ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, 2009)
3. సుబ్రమణ్యం బద్రీనాథ్ (ఇండియా వర్సెస్ వెస్టిండీస్, 2011)
4. అక్షర్ పటేల్ (ఇండియా వర్సెస్ జింబాబ్వే, 2015)
5. బరిందర్ శరణ్ (ఇండియా వర్సెస్ జింబాబ్వే, 2016)
6. నవ్‌దీప్ సైనీ (ఇండియా వర్సెస్ వెస్టిండీస్, 2019)
7. హర్షల్ పటేల్ (ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, 2021)
8. రవి బిష్ణోయ్ (ఇండియా వర్సెస్ వెస్టిండీస్, 2022)