IND vs WI 3rd T20: వెస్టిండీస్‌తో మూడో టీ20 టాస్‌ పడింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచాడు. వెంటనే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. పవర్‌ప్లేను సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. మైదానం చిన్నగానే ఉన్నా తక్కువ స్కోర్లే నమోదువుతున్నాయని వెల్లడించాడు. పిచ్‌ను అర్థం చేసుకొని ఆడితే పరుగులు వస్తాయన్నాడు. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చామని, దీపక్‌ హుడాను జట్టులోకి తీసుకున్నామని వెల్లడించాడు. తాము సైతం మొదటే బ్యాటింగ్‌ చేద్దామనే అనుకున్నామని విండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ అన్నాడు. ఒడీన్‌ స్మిత్‌ స్థానంలో డొమినిక్‌ డ్రేక్స్‌ను తీసుకున్నామని వివరించాడు.


భారత్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, అర్షదీప్‌ సింగ్‌


వెస్టిండీస్‌: బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, నికోలస్‌ పూరన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, డేవాన్‌ థామస్‌, రోమన్‌ పావెల్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, జేసన్‌ హోల్డర్‌, అకేల్‌ హుస్సేన్‌, అల్జారీ జోసెఫ్‌, ఒబెడ్‌ మెకాయ్‌




భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 సెయింట్‌ కీట్స్‌లోని బసెటెరెలో జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 9:00 గంటలకు టాస్‌ వేస్తారు. వాస్తవంగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవ్వాలి. రెండో టీ20 నాలుగు గంటలు ఆలస్యంగా మొదలవ్వడంతో నేటి మ్యాచు సమయం మార్చారు. ఆటగాళ్లకు విశ్రాంతి దొరకాలనే రెండు జట్లు ఇందుకు అంగీకరించాయి.


భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ వస్తుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.