ధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా వయసు భేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. గతంలో వంశపారపర్యంగా మాత్రమే షుగర్ వస్తుందని అనే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం యుక్త వయస్సు వారికి కూడా డయాబెటిస్ వచ్చి ఇబ్బంది పెడుతోంది. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే ఇంక ఏది తినాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. పండ్లలో అధిక స్థాయిలో చక్కెర ఉండటం వల్ల వాటిని తినాలంటే భయపడతారు. మధుమేహం పెరిగితే శరీరంలో ప్రధాన అవయవాలకు ముప్పు. ముఖ్యంగా కిడ్నీలు, కళ్లు , గుండె దెబ్బతింటాయి. అందుకే వారు ఏవైనా తినేముందు ఆ ఆహారం తినొచ్చా, తినకూడదా అని తెలుసుకున్నాకే ఆరగించాలి. కానీ మధుమేహ రోగులకి ఒక అద్భుతమైన పండు ఉంది. అదే జామకాయ. డయాబెటిక్ ఫ్రీ పండు ఇది. జామలో ఉండే అన్ని పోషకాలు మధుమేహ రోగులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.


జామకాయ వల్ల ప్రయోజనాలు


⦿ జామపండు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)లో తక్కువ స్థాయిని పొందింది. ఇది త్వరగా జీర్ణం అయ్యే ఆహారం. గ్లూకోజ్ స్థాయిలని నెమ్మదిగా పెంచుతుంది.


⦿ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఫైబర్స్ జీర్ణం కావడానికి  ఎక్కువ సమయం తీసుకుంటుంది.


⦿ జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) నివేదిక ప్రకారం 100 గ్రాముల జామపండులో కేవలం 68 కేలరీలు, 8.92 గ్రాముల చక్కెర ఉంటుంది.


⦿ జామపండులో సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువ. డయాబెటిస్ డైట్ చార్ట్‌లో ముందుండే పండ్లలో జామకాయకి మంచి స్థానం ఉంది.


⦿ సాధారణంగా విటమిన్-సి అంటే నారింజలోనే ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం. కానీ నారింజ కంటే  జామ పండులో 4 రేట్లు అధికంగా విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించి, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది.


⦿ ఇవే కాకుండా జామపండులో అనేక మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి. జామకాయ తినడం లేదా జ్యూస్‌గా చేసుకుని తాగిన ఆరోగ్యానికి మంచిదే.


⦿ మధుమేహ రోగులు నేరేడు పండ్లు కూడా తినొచ్చు. నేరేడు కాయల్లో జంబోలానా అనే యాంటీ-డయాబెటిక్ పదార్ధం ఉంది. జంబోలానా మీ రక్తప్రవాహంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది మీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో, మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also read: మీ డైట్‌లో ఈ ఆరు సూపర్ ఫుడ్స్ చేర్చుకుంటే ఆరోగ్యానికి తిరుగే ఉండదు


Also read: బియ్యపు నీళ్లతో శుభ్రం చేసుకుంటే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? పట్టుకుచ్చులా మెరుస్తుందా?