సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు టీమ్‌ఇండియా నివాళి అర్పించింది. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో క్రికెటర్లు తమ భుజాలకు నల్లరంగు బ్యాండ్లు ధరించారు. ఆట ఆరంభానికి ముందు ఆమెకు నివాళి అర్పించారు. ఒక నిమిషం మౌనం పాటించారు.
టీమ్‌ఇండియా నేడు 1000వ వన్డే ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియం మొతేరాలో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో తలపడుతోంది. లతా మంగేష్కర్ కన్ను మూశారని తెలియడంతో ఆటగాళ్లు ఆమెకు నివాళి అర్పించారు. నల్లరంగు బ్యాండ్లు ధరించి వారు మ్యాచ్ ఆడుతున్నారని బీసీసీఐ తెలిపింది.
'భారతరత్న లతా మంగేష్కర్‌కు భారత క్రికెట్ జట్టు నల్లరంగు బ్యాండ్లు ధరించి నివాళి అర్పిస్తున్నారు. గాన కోకిల లతా దీదీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఎప్పుడూ క్రికెట్, టీమ్‌ఇండియాకు అండగా నిలిచేది' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.
లతా మంగేష్కర్ ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమెకు 92 సంవత్సరాలు.
దాదాపు నెల రోజులుగా ముంబైలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కొద్ది రోజులుగా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ఆమెను వెంటిలేటర్ సపోర్టుపైనే ఉంచి డాక్టర్లు చికిత్స అందించారు. కోవిడ్-19, న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె జనవరి 8 ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్యం చేసింది.
Also Read: హమ్మయ్య ప్రపంచకప్ గెలిచేశాం! మేమిక ఐస్‌క్రీములు తినేస్తాం అంటున్న యశ్‌ధుల్
Also Read: లక్కంటే హిట్‌మ్యాన్‌దే! టీమ్‌ఇండియా 1000 వన్డేకు సారథ్యం! ఈ Stats చూస్తే ఆశ్చర్యమే!