దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,07,474 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,13,246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,04,61,148కి పెరిగింది. రికవరీ రేటు 95.91గా ఉంది.
యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011కు చేరింది. కొత్తగా 865 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,01,979కి చేరింది.
డైలీ పాజిటివిటీ రేటు 7.42గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 10.20గా ఉంది.
వ్యాక్సినేషన్..
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 167.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 74.01 కోట్ల కరోనా పరీక్షలను నిర్వహించారు. శనివారం ఒక్కరోజే 14,48,513 కరోనా పరీక్షలు చేశారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 11,394 కరోనా కేసులు నమోదయ్యాయి. 68 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కొత్తగా ఒమిక్రాన్ కేసులు నమోదుకాలేదు.
దిల్లీ..
దిల్లీలో కొత్తగా 1,604 కరోనా కేసులు నమోదుకాగా 17 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 2.87గా ఉంది.
Also Read: Lata Mangeshkar Death: లతా దీదీ మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నా.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
Also Read: Lata Mangeshkar Passes Away: ప్రఖ్యాత సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు.. ముంబయి ఆస్పత్రిలో కన్నుమూత