భారత దేశంలోనే ప్రఖ్యాత గాయనిగా పేరొందిన లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. సంగీత ప్రపంచంలో ఆమె సేవలను కొనియాడారు. ఆమె మరణం దేశానికి తీరని లోటని, ఈ వార్త విని ఎంతో బాధ పడుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.
‘‘లతా మంగేష్కర్ గారి మరణంతో నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయామూర్తి అయిన లతా అక్క మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మరణం సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటు. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి నిదర్శనంగా గుర్తుంచుకుంటాయి. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేయగల అసమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. లతా దీదీ పాటలు రకరకాల ఎమోషన్స్‌ని తీసుకొచ్చాయి. ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర మార్పులను దగ్గరగా చూశారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. ఆమె భారతదేశం ఎదుగుదల పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపేవారు. ఆమె ఎల్లప్పుడూ సమర్థమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకున్నారు. లతా దీదీ నుంచి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. లతా దీదీ మరణించినందుకు నా తోటి భారతీయులతో నాకు ఎంతో వేదన కలిగింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఓం శాంతి.’’- ప్రధాని నరేంద్ర మోదీ