ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్(92) ఇక లేరు. ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  దాదాపు నెల రోజులుగా ముంబయిలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి ఇలా ప్రతీ ఒక్కరూ లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్స్ పెడుతున్నారు. 


లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ గారి మరణవార్త విని గుండె పగిలిందని.. ఆమె అసాధారణ జీవితాన్ని గడిపారని.. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా చిరంజీవి ఉంటుందని అన్నారు. 'మీ లోటు ఎవరూ తీర్చలేరని.. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని' రాజమౌళి రాసుకొచ్చారు.