India vs Sri Lanka Virat Kohli Record: భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. అంతకుముందు గౌహతి వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును సమం చేశాడు. వన్డే క్రికెట్‌లో ఏదైనా ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో సచిన్‌తో కలిసి కోహ్లీ సంయుక్తంగా మొదటి స్థానానికి చేరుకున్నాడు.
శ్రీలంకపై 48 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ తొమ్మిది సెంచరీలు చేశాడు. ఈ సమయంలో అతను 11 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. వెస్టిండీస్‌పై 42 వన్డేల్లో 9 సెంచరీలు కూడా సాధించాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు సాధించాడు. 71 మ్యాచ్‌ల్లో 15 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. ఈ విషయంలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై ఎనిమిది సెంచరీలు సాధించాడు. అతను 40 ఇన్నింగ్స్‌లలో ఎనిమిది అర్ధ సెంచరీలు కూడా సాధించాడు.
భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టగలడు. ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానం కూడా రోహిత్ శర్మకు బాగా కలిసొచ్చింది. ఈ మైదానంలో శ్రీలంకపై రోహిత్ 264 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. దీనిని ఎవరూ ఇంకా బ్రేక్ చేయలేకపోయారు.
రెండో వన్టేలో భారత ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్
ఒకే జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ vs వెస్టిండీస్ - 9 సెంచరీలు
విరాట్ కోహ్లీ vs శ్రీలంక - 9 సెంచరీలు
సచిన్ టెండూల్కర్ vs ఆస్ట్రేలియా - 9 సెంచరీలు