Jagan Vs Adnan Sami : ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై సింగర్ అద్నాన్ సమీ మండిపడ్డాడు. “తెలుగు జెండా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోంది. యావత్ రాష్ట్రం తరపున, కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ‘RRR’ టీమ్ కు అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాము” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయితే జగన్ ట్వీట్ పై అద్నాన్ సమీ స్పందించారు.
ముందుగా మనం భారతీయులమని, వేర్పాటువాద వైఖరి మంచిది కాదంటూ జగన్ ట్వీట్ కు అడ్నాన్ సమీ రిప్లై ఇచ్చాడు. " తెలుగు జెండానా...భారత జెండా కదా? ముందుగా మనం భారతీయులం. దేశం నుండి మిమ్మల్ని మీరు వేరుచేయడం ఆపండి. అంతర్జాతీయంగా మనది ఒకే దేశం. వేర్పాటువాద వైఖరి మంచిది కాదు.1947లో మనం చూశాం కదా!! ధన్యవాదాలు...జై హింద్"అంటూ సమీ ట్వీట్ చేశాడు.
ఈ అంశంపై అద్నాన్ సమీ పై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. ఆయనకు గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొంత మంది అద్నాన్ సమీ కూడా రిప్లై ఇచ్చారు.
నిజానికి అద్నాన్ సమీ స్వతహాగా ఇండియన్ కాదు. ఆయన తండ్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తారు. అయితే సమీ లండన్‌లో పుట్టి పెరిగారు. ఆయనకు పాకిస్తాన్ పౌరసత్వం ఉంది. కానీ దాన్ని వదులుకుని ఇండియన్ గా స్థిరపడ్డారు. ఆయనకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. సమీ తల్లి కశ్మీర్ వాసి. అయితే సమీ ఇండియాపై అత్యంత భక్తి చూపిస్తారు. ఇప్పుడు ఇదే విషయంలో సీఎం జగన్ చేసిన సెపరేటిస్ట్ వ్యాఖ్యలు ఆయనకు నచ్చలేదు. ఈ వివాదం ఇబ్బంది పెట్టిందోమో కానీ సంగీతాకానికి ప్రాంతాలు వద్దని మరో ట్వీట్ పెట్టారు.
Pt. Ravi Shankar ji made INDIAN Classical Music popular to the world thru his Sitar by technically playing North Indian Classical music. However, for d world, it was INDIAN Music. The fruits of his labour wr benefitted by every Indian musician regardless of instrument or region! pic.twitter.com/EGyKK2locf
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం గతేడాది మార్చిలో రిలీజై భాషతో సంబంధం లేకుండా అన్ని బాషల్లో కోట్లు కొల్లగొట్టింది. రీసెంట్గా జపాన్‌లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్‌కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తరువాత సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. రీసెంట్గా రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.