Asia Cup 2022: 


2018 తరవాత ఇప్పుడే..


ఆసియా కప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. గతేడాది T-20 వరల్డ్‌ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. 
తరవాత మళ్లీ ఇప్పుడే ఈ రెండు దేశాలు పిచ్‌పై క్రికెట్ సమరానికి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 28న మ్యాచ్ జరగనుంది. 2018లో చివరిసారి ODI మ్యాచ్ ఆడాయి భారత్, పాక్. ఈసారి T-20 ఫార్మాట్‌లో ఆడేందుకు రెడీ అవుతున్నాయి. నాలుగేళ్ల తరవాత ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగుతున్న తరుణంలో గత మ్యాచ్‌లలో ఎవరు నెగ్గారు, ఎవరు తగ్గారు అన్న అంశంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. గత 5 భారత్, పాక్ మ్యాచ్‌ల్లో హైలైట్స్‌ని ఓసారి గుర్తు చేసుకుందాం. 


టాప్‌-5 హైలైట్స్ ఇవే..


1. 2010లో జరిగిన ఆసియా కప్‌ భారత్-పాక్ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకే సినిమాలో యాక్షన్, డ్రామా, సస్పెన్స్ ఉంటే ఎంత ఎగ్జైటింగ్‌గా ఉంటుందో..అప్పట్లో ఈ మ్యాచ్ చూసిన వాళ్లు కూడా అంతే  ఎగ్జైట్ అయ్యారు. వాదనలు, ఊహించని మలుపులతో ఆద్యంతం చాలా థ్రిల్లింగ్‌గా సాగిపోయిందీ మ్యాచ్. గౌతమ్ గంభీర్, కమ్రాన్ అక్మల్ మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్ జోక్యం చేసుకుని వాళ్లిద్దరికీ సర్ది చెప్పాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ వాగ్వాదం...ఇతర ఆటగాళ్లనూ రెచ్చగొట్టింది. గౌతమ్ గంభీర్ వికెట్ పోవటంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. కానీ...హర్భజన్ సింగ్ ఉన్నట్టుండి ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. లాస్ట్‌ బాల్‌కి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. అప్పుడే భజ్జీని అందరూ "ఆల్‌ రౌండర్" అంటూ పొగడ్తల్లో ముంచేశారు. 


2. 2012లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌...క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చింది. అదే సమయంలో బాధనూ కలిగించింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆసియా కప్‌లో ఆడిన చివరి మ్యాచ్ ఇదే కావటం అందుకు కారణం. 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటానికి బరిలోకి దిగింది భారత్. సచిన్ 48 బాల్స్‌కి 52 పరుగులు చేశాడు. ఆ తరవాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి ఫస్ట్ బాల్ నుంచే ఛేజింగ్ మొదలు పెట్టాడు. 142 బాల్స్‌కు 183 పరుగులతో సచిన్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు కోహ్లీ. భారత్‌ను విజయాన్ని అందించాడు. 


3. 2014లో మీర్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది దడదడలాడించాడు. సిక్స్‌ హిట్టింగ్‌లో తనకున్న స్కిల్స్‌ని మొత్తం వాడేశాడు ఈ మ్యాచ్‌లో. రవీంద్ర జడేజా, అశ్విన్‌ బౌలింగ్‌లో విరుచుకు పడి ఆడాడు. 17 ఓవర్లలో 96 రన్స్ చేసి...భారత్‌కు 245 పరుగుల లక్ష్యాన్ని అందించింది పాకిస్థాన్. అయితే...మిడిల్ ఆర్డర్ తడబడటం వల్ల ఉన్నట్టుండి మ్యాచ్ అంతా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఆ సమయంలో 12 బంతుల్లో 34 పరుగులు చేశాడు అఫ్రిది. 


4. 2016 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ కూడా ఎవరూ మర్చిపోలేరు. అందుకు కారణం...మహమ్మద్ అమీర్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌పై నిషేధం ఉండగా...ఈ మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ అయ్యాడు. ఈ టీ-20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రహానే వికెట్లు తీసి మరోసారి తన టాలెంట్‌ నిరూపించుకున్నాడు. సురేశ్ రైనా వికెట్‌ను కూడా తీశాడు మహమ్మద్ అమీర్. అప్పటికి భారత్ స్కోర్ 8-3. మళ్లీ భారత్ మాస్టర్ ఛేజర్ కోహ్లీ రంగంలోకి దిగి 49 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించాడు. 


5. 2018లో జరిగిన ఆసియా కప్‌లో చివరిసారి భారత్-పాక్ తలపడ్డాయి. అయితే...ఈ వార్ పూర్తిగా వన్‌ సైడ్ అయింది. భారత్‌ 238 పరుగుల లక్ష్యాన్నీ ఛేదించి విజయం సాధించింది. సూపర్ -4 లోనూ భారత్ విజయం నమోదు చేసింది. 


Also Read: Ind vs ZIM- 1st Innings Highlights: శుభ్ మన్ గిల్ సెంచరీ.. జింబాబ్వే ముందు 290 పరుగుల లక్ష్యం