IND vs NZ: వన్డే సిరీస్‌లో శ్రీలంకను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో ODI, T20 సిరీస్‌లకు సిద్ధమైంది. జనవరి 18వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేస్తే భారత జట్టు నంబర్ వన్ వన్డే జట్టుగా అవతరిస్తుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ నంబర్‌వన్‌లో ఉంది. కివీ జట్టుకు 117 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.


ఇటీవల న్యూజిలాండ్ తమ స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్‌ను 2-1 తేడాతో ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆడడం భారత జట్టుకు అంత సులువు కాదు. వన్డేల్లో కివీస్ జట్టు చాలా బలంగా ఉంది. కాబట్టి న్యూజిలాండ్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమ్ ఇండియా ఎలా నంబర్ వన్ వన్డే జట్టుగా అవతరించగలదో తెలుసుకుందాం.


లెక్కలు ఇలా ఉంటాయి?
ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ రెండో స్థానంలోనూ, ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంలోనూ ఉన్నాయి. వన్డే సిరీస్‌లో శ్రీలంకను 3-0తో ఓడించడం ద్వారా భారత జట్టు 110 రేటింగ్ పాయింట్లను సాధించింది. కాగా న్యూజిలాండ్ జట్టు 117 రేటింగ్స్‌తో నంబర్‌వన్‌లో ఉంది.


న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించిన తర్వాత, భారత జట్టు రేటింగ్ పాయింట్లు 114కు చేరుకుంటాయి. మరోవైపు, న్యూజిలాండ్ వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయి తన పాయింట్లను కోల్పోయి భారత్ స్థానంలో నాలుగో స్థానానికి వస్తుంది. తద్వారా వన్డేల్లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తమ స్థానాల్లోనే కొనసాగుతాయి.


మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌గా నిలిచే అవకాశం
వన్డేలతో పాటు మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా అవతరించే అవకాశం ఉంది. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు ఇప్పటికే నంబర్‌వన్‌లో ఉంది. అదే సమయంలో, న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించడం ద్వారా భారత జట్టు వన్డేల్లో నంబర్‌వన్‌గా అవతరిస్తుంది.


ఇది కాకుండా భారత జట్టు టెస్టులో నంబర్ టూ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో 3-1తో విజయం సాధించడం ద్వారా భారత జట్టు నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం టెస్టుల్లో ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా ఉంది.