తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని... తాను మైనార్టీ ఎమ్మెల్యే అని కావాలనే తనపై కక్ష కడుతున్నారని నిజమాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు, రైస్ బిసినెస్ లో ఏ ఒక్క చిన్నతప్పు జరిగినా చౌరస్తాలో ఉరి తియ్యాలన్నారు. సివిల్ సప్లై అధికారుల రైస్ మిల్ తనిఖీల్లో క్లిన్ చిట్ ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం మైనార్టీ ఎమ్మెల్యేని అని కొందరు టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ వార్తలపై లీగల్ గా వెళతానని అన్నారు.
ఎమ్మెల్యే షకీల్ రైస్ మిల్ లో రూ.120 కోట్ల లూటీ జరిగిందని ప్రచారం మానుకోవాలని ఇటీవల కొందరు పనిపట్టుకొని బద్నాం చేస్తున్నారని.. వారికి సంబంధించిన ఆడియో, వీడియో ఫుటేజీలు బయటపెడతమన్నారు షఖిల్. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీల్లో అన్ని రైస్ మిల్లులో జరపాలని రైస్ మిల్లర్లకు ఇబ్బందులకు గురిచేయిద్దని హెచ్చరించారు. నాపై వస్తున్న వార్త లు పూర్తిగా అసత్యం, అవాస్తవo.. ఇలాంటి ఆరోపణలు చేయటం సరికాదు. ప్రజా జీవితంలో ఉన్న తన లాంటి వారిపై నిరాధార ఆరోపణలు తగవు అని సూచించారు.
నేను తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్దం..
సీబీఐతో పాటు ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైనా ఉంటే వాటితో కూడా విచారణ జరిపించండని అన్నారు. ఇది ఒక పెద్ద కుట్ర.. నా పై జరుగుతున్న కుట్రకు సంబందించిన ఆధారాలు కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. త్వరలో వాటిని బయటపెడతానని అన్నారు ఎమ్మెల్యే. నాపై వస్తున్న తప్పుడు ప్రచారంపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఒక ఎమ్మెల్యేను, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే సాధారణ ప్రజల పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. మూడు సార్లు నా రైస్ మిల్లులు ఎఫ్‌సిఐ వారు తనిఖీలు చేసి క్లీన్ చిట్ ఇచ్చారు. అయినా ఒక ప్రధాన వార్త పత్రికల్లో ఇలాంటి వార్తలు రాయడం తగదన్నారు. ప్రజలకు, అధికారులకు సమాధానం చెప్తాను కానీ ఇలా పేపర్లలో అవాస్తవాలు వస్తే వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మైనార్టీ ఎమ్మెల్యే ను కనుకే నాపై తరుచూ తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి.
2008 నుంచి ధాన్యం వ్యాపారంలో ఉన్నాను..
గత ఖరీఫ్‌లో తమ మిల్లులకు ఇచ్చిన ధాన్యంలో 96 శాతం సిఎమ్మార్ ఎఫ్ చేసి... రబీలో 14 శాతానికి 11 శాతం ధాన్యం తిరిగి ఇచ్చేశామని తెలిపారు. ఒక్క గ్రాము ధాన్యం కూడా తమ మిల్లులో పక్కదారి పట్టలేదు. ఇలాంటి ఆరోపణలు చేయటం బాధాకరమన్నారు. 14 ఏళ్లుగా ఎలాంటి అవినీతి లేకుండా బ్యాంక్‌ల సహకారంతో వ్యాపారం నడిపిస్తున్నామని.. రైతుల ధాన్యం నుంచి ఒక్క కిలో కోత లేకుండా తీసుకున్నామని అన్నారు. పెట్టుబడి లేకుండా రైస్ మిల్లులు ఏర్పాటు చేసి రూ.120 కోట్ల బియ్యం పక్కదారి పట్టించానని వార్త రాసిన వారు అది నిజమని నిరూపించాలని అన్నారు.
రాష్ట్రంలో రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా బెదిరింపులకు గురౌతున్నారు..ఒక రైస్ మిల్లర్గ నాకు బాధగా ఉందని అన్నారు ఎమ్మెల్యే షఖిల్. మిల్లర్లు తమ జీవిలను తాకట్టు పెట్టీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే షఖిల్.
Bodhan MLA: నేను తప్పు చేసినట్లు తేలితే నడిరోడ్డుపై ఉరి తీయండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ABP Desam
Updated at:
16 Jan 2023 08:19 PM (IST)
నిజమాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు, రైస్ బిసినెస్ లో ఏ ఒక్క చిన్నతప్పు జరిగినా చౌరస్తాలో ఉరి తియ్యాలన్నారు.
నిజమాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు
NEXT
PREV
Published at:
16 Jan 2023 08:19 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -