ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చెలరేగిన భారత బౌలర్లు ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో విజయాన్ని అందించారు. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఏ మాత్రం పోరాటం చేయకుండా చేతులెత్తేసింది. అన్ని విభాగాల్లో విఫలమై మూల్యం చెల్లించుకుంది. దాంతో మూడు టెస్టులు ముగిసేసరికి ఇంగ్లాండ్, భారత్ 1-1తో సమంగా ఉన్నాయి.


అన్ని విభాగాల్లో విఫలమైన భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో దారుణ పరాభవాన్ని చవిచూసింది. అయితే టెస్టు రెండో రోజు టీమిండియా యువ వికెట్ కీపింగ్ సంచలనం రిషబ్ పంత్ ను అంపైర్లు మందలించడంపై మరోసారి చర్చ జరుగుతోంది. మూడో టెస్టులో ఆట రెండో రోజు చేతి గ్లౌవ్స్‌కు వేసిన టేప్‌ను తీసేయాలని అంపైర్లు సూచించడంతో అతడు అలాగే చేశాడు. కానీ అసలే టెస్టులో భారత ఆటగాళ్లకు ప్రతికూల ఫలితాలు రావడంతో పంత్‌కు కీపింగ్ చేయడం ఇబ్బందిగా మారిందని నెటిజన్లు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Also Read: Mann Ki Baat: ఆ పతకమే 'మేజర్ ధ్యాన్ చంద్'కు అతి పెద్ద నివాళి: మోదీ


వాస్తవానికి రిషబ్ పంత్ వేళ్లకు టేప్ వేసుకోవడం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అందువల్లే మ్యాచ్ అధికారులు అలెక్స్ వార్ఫ్, రిచర్డ్ కెట్టెల్బోలు భారత వికెట్ కీపర్ పంత్‌ను చేతి వేళ్లకు వేసిన టేప్‌ను తీసివేయాలని సూచించారు. ఎంసీసీ రూల్స్ ప్రకారం.. నాలుగో, అయిదో వేళ్లను కలిపి టేప్ వేయకూడదు. చేతి వేలికి టేప్ వేసుకోవాలంటే అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.


27.2.1 నియమం ప్రకారం.. 27.1 కింద ఓ వికెట్ కీపర్ తన చూపుడు వేలు, బొటన వేలును కలిపి టేప్ వేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇతర వేళ్లను కలిపి టేప్ వేయడానికి నిబంధనలు అంగీకరించవు. అయితే మూడో టెస్టులో పంత్ చేతివేళ్ల గ్లౌవ్స్‌కు వేసిన టేప్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి అంప్లైర్లు అతడిని మందలించారు. ఆ తరువాత ఆట సజావుగా సాగడం తెలిసిందే. హెడింగ్లీ టెస్టులో టీమిండియా ఓటమి తరువాత ఒక్కో విభాగంలో ఏం లోపాలు జరిగాయనే దానిపై జట్టు, మేనేజ్ మేంట్ ఫోకస్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో పంత్ చేతి వేళ్లకు టేప్ వేసుకోవడం కూడా తప్పేనా అని.. నిబంధనలు, అక్కడ ఏం జరిగిందో అర్థం కాని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నాలుగో టెస్టు కోసం విరాట్ కోహ్లీ సేన తమ వ్యూహాలు రచిస్తోంది.
Also Read: Bhavinavben Wins Silver: రజతం సాధించిన భవీనాబెన్.. టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓటమి