భారత పేసర్ బుమ్ బుమ్ బుమ్రా అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లు అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలో అతడు భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు.
భారత్ తరఫున వేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. భారత్ x ఇంగ్లాండ్ మధ్య ఓవల్ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో ఈ రికార్డును నమోదు చేశాడు బుమ్రా. 24 టెస్టుల్లోనే బుమ్రా 100 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడేళ్ల క్రితం టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా ఈ రోజు జరుగుతోన్న టెస్టులో ఓలీ పోప్ వికెట్ తీయడం ద్వారా ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు.
Also Read: ENG vs IND 2021: స్టాండ్స్‌లో ఒంటరిగా అశ్విన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్... నెట్టింట్లో రచ్చ రచ్చ
ఇప్పటి వరకు భారత్ తరఫున 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్ (25), మహ్మద్ షమి(29), ఇర్ఫాన్ పఠాన్ (29) టాప్ - 3లో ఉన్నారు. ఇప్పుడు బుమ్రా వీరందరినీ దాటుకుని 24 టెస్టుల్లోనే 100 వికెట్లు తీసి అగ్రస్థానానికి ఎగబాకాడు. ఇక టెస్టుల్లో వేగవంతంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా 18వ స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజాతో కలిసి సంయుక్తంగా 18వ స్థానంలో కొనసాగుతున్నాడు.