IND Vs BAN 3rd T20 Toss Update: భారతదేశంలో బంగ్లాదేశ్ పర్యటన తుది అంకానికి చేరుకుంది. మూడు టీ20 సిరీస్‌లో చివరిదైన మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టీ20ల్లోనూ గెలిచి భారత్ ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది.
పరుగుల వరద ఖాయం...
ఉప్పల్ స్టేడియం బ్యాటర్లకు చాలా అనుకూలిస్తుంది. దీంతో నేటి మ్యాచ్‌లో టీమిండియా పరుగుల వరద పారించడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పవచ్చు. విధ్వంసకర బ్యాటర్లు అయిన నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మలది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కాబట్టి ఉప్పల్ స్టేడియం వారికి కొత్తేమీ కాదు. ఈ మ్యాచ్‌లో వారి బ్యాటింగ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలూ వెయిట్ చేస్తాయని చెప్పవచ్చు.
హర్షిత్ రాణా దూరం
వైరల్ ఫీవర్ కారణంగా పేసర్లలో ఒకడైన హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. అలాగే అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న కారణంతో మొదట బ్యాటింగ్ తీసుకోవాలని నిర్ణయించినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మాత్రం తాము టాస్ గెలిచినా బౌలింగ్ తీసుకోవాలని అనుకున్నామని, కాబట్టి టాస్ గెలిచినా ఓడినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేశారు. తమీమ్, మహేదీ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తో భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన ముగుస్తుంది. టెస్టు సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టీ20 సిరీస్‌ను కూడా ఇప్పటికే 2-0తో గెలుచుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఒక్క ఓటమి కూడా లేకుండా సిరీస్‌ను భారత్ ముగించినట్లు అవుతుంది.
Read Also: రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
బంగ్లాదేశ్ తుదిజట్టు
పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తాంజిమ్ హసన్
భారత్ తుదిజట్టు
సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్
Also Read: Womens T20 World Cup: ఇంగ్లాండ్ విజయపరంపర , లంకతో పోరుకు భారత్ సిద్ధం