Cricketer Sirajuddin joined Telangana Police Department as DSP : భారత క్రికెట్ టీమ్‌లోని స్టార్ బౌలర్, ప్రౌడ్ హైదరాబాదీ సిరాజుద్దీన్ ను తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీగా నియమించింది. ప్రపంచకప్ సాధించడంలో సిరాజుద్దీన్‌ది ప్రత్యేకమైన పాత్ర. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీగా ఉద్యోగం ప్రకటించింది. ఇంటి స్థలంతోపాటు ఇతర తాయిలాలు కూడా ఇచ్చింది. డీఎస్పీగా నియామక పత్రం తీసుకున్న సిరాజ్.. వెంటనే యూనిఫాంలో డిపార్టుమెంట్ స్టైల్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పటికి అయితే ఆయనక ఎక్కడా పోస్టింగ్ ఇవ్వరు. విధులు నిర్వర్తించడానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన క్రికెటర్ గా యాక్టివ్ గా ఉన్నంత కాలం డీఎస్పీగా ఉద్యోగం ఉంటుంది. ఆ తర్వాత సర్వీసులో చేరాల్సి ఉంటుంది.


అయితే రిటైరైన తర్వాత డీఎస్పీగా చేరుతారా అంటే సందేహమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇతర ఆటల్లో ఉన్న వారికి డీఎస్పీ ఉద్యోగం బంగారమే. ఎందుకంటే ఆయా ఆటల్లో ఆదాయం తక్కువ. రిటైరయ్యాక ఉద్యోగం తప్పనిసరి. కానీ క్రికెట్‌లో అలా కాదు. పైగా స్టార్ గా మారిన తర్వాత వచ్చే ఆదాయం వేరుగా ఉంటుంది. మహమ్మద్ సిరాజుద్దీన్ పేద కుటుంబం నుంచి వచ్చారు కానీ..ఇప్పుడు ఆయన ఆదాయం ఏటా కోట్లలోనే ఉంటుంది. పూర్తి స్థాయిలో కెరీర్ పూర్తయ్యే సరికి ఆయన కబేరుడు అవుతారు. అప్పుడు రూ. లక్ష జీతం కోసం డీఎస్పీగా పని  చేయాల్సిన అవసరం రాదు.              


సొంత ఊరు దశ మార్చేసిన రేవంత్ రెడ్డి - ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారంటే ?


పైగా స్టార్ బౌలర్‌గా రిటైరైన తర్వాత ఆయనకు క్రికెట్ రంగంలోనే అనేక అవకాశాలు వస్తాయి. కోచ్ నుంచి రాజకీయ నాయకుడిగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటీవల హర్యానా ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన వినేష్ ఫోగట్ కు కూడా హర్యానా ప్రభుత్వం గతంలో ఓ ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసే ఫోగట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇలా విజయాలు సాధించిన క్రీడాకారులకు ఆయా రాష్ట్రాలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తూంటాయి. కానీ కెరీర్ పూర్తయిన తర్వాత కూడా ఆయా ఉద్యోగంలో చేరే వారు చాలా తక్కువ. కానీ కొంత మంది చేరుతూనే ఉంటారు. 


పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు


2007 ప్రారంభ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో అత్యంత ఉత్కంఠగా జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ లో మిస్బా ఉల్ హక్‌న అవుట్ అవడం ఆ మ్యాచ్ చూసిన వారు మర్చిపోలేరు. హక్ ను అవుట్ చేసిన బౌలర్ జోగిందర్ శర్మ. చాలా కాలం క్రికెట్ ఆడిన ఆయన .. ఇప్పుడు హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ కూడా చాలా కాలం ఆడారు. ఎన్ని ఆస్తులు ఉన్నా ఆయన డీఎస్పీగా పని  చేస్తున్నారు. త్వరలో ఐపీఎస్ హోదా ఇస్తారని ఆశిస్తున్నారు.