IND W vs SA W: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జర్నీ ముగిసింది. సెమీస్‌కు ముందు డూర్ ఆర్ డై మ్యాచులో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 278 పరుగుల టార్గెట్‌ను ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా ఛేదించింది. లారా వోల్వర్త్ (80), లారా గుడ్‌ఆల్ (49), మిగాన్ డుప్రీజ్ (52*) జట్టును గెలుపుబాట పట్టించారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (48) రాణించారు.
సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో టీమ్‌ఇండియా స్థాయికి తగినట్టు పోరాడలేదు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ చక్కని భాగస్వామ్యాలు సాధించి మ్యాచును లాగేసుకుంది. 14 పరుగుల వద్ద లిజెల్ లీ (6)ను హర్మన్ రనౌట్ చేసింది. ఆ తర్వాత వోల్వర్త్, గుడ్‌ఆల్ మరో వికెట్ ఇవ్వకుండా ఆడారు. రెండో వికెట్‌కు 125 పరుగుల పార్ట్‌నర్ షిప్ సాధించారు. వీరిద్దరూ స్వల్ప తేడాతో ఔటైనా మిగ్నాన్ డూప్రీజ్ అజేయంగా నిలిచింది. సున్‌లూస్ (22), మారిజాన్ కాప్ (32) ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. లూస్‌ను హర్మన్, కాప్‌ను రిచాఘోష్ ఔట్ చేసినా డూప్రీజ్ పట్టువిడవలేదు. పెరిగిన రన్‌రేట్‌ను బౌండరీలతో తగ్గించింది.
ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 7 పరుగులు అవసరం. తొలి బంతికి 1 పరుగు వచ్చింది. రెండో బంతికి చెట్టీ రనౌట్ అయింది. దాంతో ఆఖరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా ఐదో బంతికి డూప్రీజ్‌ను దీప్తి ఔట్ చేసింది. హర్మన్ లాంగాన్‌లో క్యాచ్ అందుకుంది. అయితే అది నోబాల్‌గా తేలడంతో టీమ్‌ఇండియాతో పాటు అభిమానులు స్టన్ అయ్యారు. ఆ తర్వాత 2 బంతుల్లో 2 పరుగులు రావడంతో సఫారీలు విజయం సాధించారు. ఇండియా సెమీస్‌కు వెళ్లకుండానే ఇంటికి తిరిగొచ్చేసింది.