ICC ODI Ranking: రాయ్‌పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా భారత జట్టు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో విజయం సాధించడంతో భారత జట్టు మూడో ర్యాంక్‌కు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్ నంబర్ వన్ కిరీటం కూడా కోల్పోయింది.
రాయ్‌పూర్ మ్యాచ్‌కు ముందు ఇదే పరిస్థితి
రాయ్‌పూర్‌లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టు 115 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ 113 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 112 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో, 111 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు నాలుగో స్థానంలో ఉన్నాయి.
ఇప్పుడు రాయ్‌పూర్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం ద్వారా భారత జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పు చేసింది. భారత్ ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు 113 రేటింగ్స్, 3400 పాయింట్లతో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన న్యూజిలాండ్ జట్టు 113 రేటింగ్స్, 3166 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. భారత జట్టు 113 రేటింగ్‌లు, 4847 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా నాలుగో స్థానానికి పడిపోయింది.
భారత జట్టు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ జట్టుగా అవతరిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత జట్టు వన్డేల్లో నంబర్‌వన్‌గా అవతరిస్తుంది, లేకపోతే ఆ అవకాశం ఉండదు.
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. మొదట బౌలర్లు 108 పరుగులకే కివీస్ ను ఆలౌట్ చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది.
108 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ (51) స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ 49 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ కు తోడైన కోహ్లీ (11) రెండు చూడచక్కని బౌండరీలు కొట్టాడు. అయితే ఆ తర్వాత స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. మరోవైపు గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ (53 బంతుల్లో 40).. ఇషాన్ కిషన్ (8) తో కలిసి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు.