ICC Best Men's ODI Team: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జనవరి 24వ తేదీన ఉత్తమ పురుషుల వన్డే జట్టును ప్రకటిస్తుంది. ఈసారి ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టులో ఎంత మంది పూర్తి సభ్యులు, ఎంత మంది అసోసియేట్ ఆటగాళ్లకు చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ కారణంగా పూర్తి సభ్యులు ఎక్కువగా ODI క్రికెట్ ఆడలేదు, దీని కారణంగా అసోసియేట్ దేశాల ఆటగాళ్లు వన్డే క్రికెట్‌పై ఆధిపత్యం చెలాయించారు.


2022 సంవత్సరపు పురుషుల అత్యుత్తమ వన్డే జట్టులో అసోసియేట్స్ దేశానికి చెందిన ఆటగాళ్లకు చోటు దక్కడం ఖాయం. అదే సమయంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, భారత ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ కూడా జట్టులో చోటు దక్కించుకోవచ్చు.


ఉత్తమ వన్డే జట్టును ఎలా ఎంపిక చేస్తారు?
ఐసీసీ సంవత్సరపు అత్యుత్తమ జట్టును ఎంపిక చేయడానికి వన్డే ఆటగాళ్లందరిపై ఒక కన్ను వేసి ఉంచుతుంది. బౌలర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, ఆల్‌రౌండర్‌గా లేదా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఏడాది పొడవునా మంచి ప్రదర్శన చేసే ఆటగాళ్లకు సంవత్సరపు అత్యుత్తమ వన్డే జట్టులో ఐసీసీ చోటు కల్పిస్తుంది. 2022 సంవత్సరం గురించి మాట్లాడితే అది బౌలింగ్ అయినా సరే, బ్యాటింగ్ అయినా సరే అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.


ఐసీసీ ఉత్తమ వన్డే జట్టు (అంచనా)
గెర్హార్డ్ ఎరాస్మస్ (నమీబియా), శ్రేయస్ అయ్యర్ (భారత్), శుభమన్ గిల్ (భారత్), షాయ్ హోప్ (వెస్టిండీస్), బాబర్ ఆజం (కెప్టెన్, పాకిస్తాన్), టామ్ లాథమ్ (వికెట్ కీపర్, న్యూజిలాండ్), హరీస్ రౌఫ్ (పాకిస్తాన్), మహ్మద్ సిరాజ్ (భారత దేశం), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), సికందర్ రజా (జింబాబ్వే).


ఐసీసీ అసోసియేట్ మెంబర్ అయిన నమీబియాకు చెందిన గెర్హార్డ్ ఎరాస్మస్ గత సంవత్సరం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను 21 మ్యాచ్‌ల్లో 20 ఇన్నింగ్స్‌ల్లో 956 పరుగులు చేశాడు. వీరితో పాటు పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజమ్, భారత్‌కు చెందిన శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ కూడా బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో మహ్మద్‌ సిరాజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, హరీస్‌ రవూఫ్‌ తమదైన ముద్ర వేశారు. ఆల్ రౌండర్ల విభాగంలో సికందర్ రజా అద్భుత ప్రదర్శన కనబరిచాడు.


ఐసీసీ 2022 ఏడాదికి గాను పురుషుల టీ20 జట్టును ఇప్పటికే ప్రకటించింది. టీమ్‌ఇండియా నుంచి ముగ్గురు క్రికెటర్లకు ఈ జట్టులో చోటిచ్చింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీ టాప్‌ స్కోరర్‌ విరాట్‌ కోహ్లీ, పడుకొని మరీ చితక బాదేసిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలను ఐసీసీ ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌ను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపిన జోస్‌ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది.


ఐసీసీ టీ20 జట్టు: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్థాన్‌), విరాట్‌ కోహ్లీ (భారత్), సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్), గ్లెన్ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌), సికిందర్‌ రజా (జింబాబ్వే), హార్దిక్‌ పాండ్య (భారత్‌), సామ్‌ కరన్‌ (ఇంగ్లాండ్‌), వనిందు హసరంగ (శ్రీలంక), హ్యారిస్‌ రౌఫ్‌ (పాకిస్థాన్‌), జోష్ లిటిల్‌ (ఐర్లాండ్‌)