సర్పంచ్‌లపై సమస్యలపై విపక్షాలు పోరుబాట పట్టాయి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ, వామపక్షాలు ఒకే వేదికపై కనిపించాయి. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేసేందుకు సిద్ధమని నేతలు ప్రకటించారు.  


పంచాయతీ సర్పంచులు బాధ పెట్టడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. సర్పంచులు సమస్య మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సర్పంచులు చేసే పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌, ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్‌ సమావేశం ఈ ఇద్దరి నేతలు పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్ళిస్తుందనీ ఆరోపించారు ఈ సమావేశానికి హాజరైన నాయకులు. కేంద్ర ప్రభుత్వం  14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంపిన రూ.8,660 కోట్ల నిధులు తిరిగి సర్పంచుల ఎఫ్‌పిఎంఎస్‌ ఖాతాలో జమ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలను సర్పంచ్‌ పరిధిలోకి తీసుకువచ్చి సర్పంచులకు, ఎంపిటిసిలకు 15వేలు, ఎంపిపి, జెడ్‌పిటిసిలకు 30వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. వాలంటీర్ల కంటే సర్పంచులకు తక్కువ గౌరవ వేతనం ఇస్తున్నారనీ ఆరోపించారు. పంచాయతీ సర్పంచులను బాధ పెట్టడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అని మండిపడ్డారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి తన క్యాబినెట్ మంత్రుల తరహాలనే, సర్పంచులను దిష్టిబొమ్మలుగా చేశారనీ ఆరోపించారు సీపీఐ, టీడీపీ లీడర్లు. రాష్ట్రంలో మంత్రులను గుర్తించే పరిస్థితి లేదనీ, మంత్రులను  దద్దమ్మలు చేశారనీ ఎద్దేవా చేశారు. సర్పంచుల సమస్యల పట్ల సీఎం ఇంటిని ముట్టడించటానికైనా వెనుకాడమాని హెచ్చరించారు. సర్పంచులు చేసే ఆందోళనలో తమ పార్టీల నేతలు ముందుంటుందనీ వెల్లడించారు.


భీమవరం నుంచే బీజేపీ ఎన్నికల సమరం!


బిజెపికి భీమవరానికి వీడదీయలేని అనుబంధం ఉందని భవిష్యత్‌లో నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ శాశ్వత నియోజకవర్గంగా మారుస్తామంటున్నారు నేతలు. భీమవరం కేంద్రగా జరిగే పార్టీ సమావేశాలకు సంబంధించిన వివరాలను నేతలు వెల్లడించారు. ఈ సమావేశాలకు ఐదుగురు కేంద్రమంత్రులు రానున్నారని తెలిపారు. భీమవరంలో మూడు పర్యాయాలు జరిగాయని, నాల్గోసారి కూడా ఇక్కడే జరుగుతున్నాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతో బిజెపికి ఎంతో అనుబంధం ఉందని, ప్రాంతీయ పార్టీలు బిజెపిపై విషప్రచారం చేస్తున్నాయని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక పెట్టిందని, కీలక పాత్ర పోషించనున్నామని వివరించారు.


కుటుంబ పార్టీలతో పొత్తులు లేవు....
కుటుంబ పార్టీలతో పొత్తులు లేవని, 2024లో అధికారాన్ని చేపట్టే దిశగా బిజెపి ముందుకు వెళుతుందని అన్నారు బీజేపీ నేతలు. భీమవరంలో జరిగే రాష్ట్రకార్యవర్గ సమావేశాల్లో బిజెపి కీలక పాత్ర పోషిస్తోందని, ఈ రాష్ట్రంలో 18 శాతం ఓటింగ్ సాధించిన పార్టీ బిజెపి రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగేందుకు కీలక సమయం ఇదేనని అభిప్రాయపడ్డారు. భీమవరం మున్సిపల్ ఎన్నికలు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుందని, జిల్లాలో నరసాపురం బిజెపి శాశ్వతంగా అసెంబ్లీ అని అన్నారు.