A case has been registered in AP Cyber Crime regarding hacking of DGP AP Official Twitter account


2020 ఫిబ్రవరి నుంచి పూర్తిగా వాడుకంలో లేని ఏపీ డీజీపీకి చెందిన సోషల్ మీడియా హ్యాడింల్‌ హ్యాక్ అయింది. dgp ap official ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి తప్పుడు ఫోటోలు, అసభ్యకరమైన ఫొటోలకు లైకులు కొడుతున్న వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఈ అంశం ప్రభుత్వం వద్దకు కూడా వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం, ఊదేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించింది. దీనిపై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. హ్యాకింగ్‌కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సాంకేతిక విభాగం డి‌ఐ‌జి పి.హెచ్‌డి.రామకృష్ణ తెలిపారు.


అసభ్యకరమైన పోస్ట్‌లు 


ఏపీ డీజీపీ పేరుతో పోస్ట్‌లు ఉన్న పాత ట్విట్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీంతో ఈ వ్యవహరం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌ను ఎందుకు హ్యాక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ఈ వ్యవహరం ఎలా బయటకు వచ్చింది. బయటకు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు, ఎవరు ఇప్పటికీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమ్మాయిల పోస్ట్‌లను కూడా ట్విట్టర్ ఖతాకు ట్యాగ్ చేశారు. ట్విట్టర్ హ్యాక్ అయిన విషయాన్ని అధికారులు ఆలస్యగా గుర్తించారు.


పోలీసులు గుర్తించే సమయానికే చాలా మందికి ఈ పోస్ట్‌లను సర్క్యులేట్ చేశారు. షేర్‌లతోపాటుగా స్క్రీన్ షాట్‌లను కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని షేర్ చేశారు. అంతే కాదు పోలీస్‌శాఖలో ఓ మహిళా అధికారి కూడా ఇలాంటి సిచ్చుయేషన్ ఫేస్‌ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు గ్రూప్‌లో ఇలాంటివి ట్రోల్ అవుతున్నాయని తెలిపారు.  


పొలిటికల్ పాత్ర...


ఈ వ్యవహరంలో రాష్ట్రంలోని పొలిటిక్ పార్టీల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు అంటున్నారు. రాజకీయంగా జరుగుతున్న దాడులు నేపథ్యంలో సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సోషల్ మీడియా వింగ్‌లోని కొందరిని పోలీసుల విచారణ చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్‌లో పని చేసి మానేసిన వారిని కూడా పోలీసులు విచారణ చేసి, అసలు విషయలు బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఏకంగా డీజీపీని టార్గెట్ చేసి మహిళకు చెందిన అసభ్య ఫోటోలను కూడా ట్యాగ్ చేయటం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి, కేసును ఛేదించేందుకు విచారణ చేస్తున్నారు. డిజిటల్ ఎవిడెన్స్ సేకరించి కేసును పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసు అధికారులు, భావిస్తున్నారు. ఇప్పటికే డీజీపీ ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.