Highest Paid Female Athletes 2024: మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది కూడా మహిళల స్పోర్ట్స్ లో టెన్నీసే రాజ్యమేలింది. ఈ ఏడాది మహిళల క్రీడల్లో అత్యధికంగా సంపాదించే క్రీడాకారిణుల్లో.. తొమ్మిది మంది టెన్నీస్ ప్లేయర్సే ఉన్నారంటే వారి రూలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాప్ 5లో అయితే నలుగురు టెన్నీస్ మహిళా క్రీడాకారిణులు ఉన్నారు. మహిళల క్రీడలలో అత్యధికంగా సంపాదించేవారి జాబితాలో టెన్నిస్ ఆధిపత్యం కొనసాగుతోందని స్పోర్టికో చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. పది మందితో కూడిన ఈ జాబితాలో దిగ్గజ మహిళా అథ్లెట్లు ఉన్నారు. కైట్లిన్ క్లార్క్, సిమోన్ బైల్స్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరు ఇద్దరూ భారీ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలతో టాప్ లో ఉన్నారు. 2024లో అత్యధికంగా సంపాదించిన మహిళా ప్లేయర్లు ఒక్కసారి పరిశీలిస్తే...
కోకో గాఫ్: 30.4 మిలియన్ డాలర్లు
మహిళల టెన్నీస్ లో అమెరికన్ టెన్నీస్ స్టార్ కోకో గాఫ్ ఆధిపత్యం కొనసాగుతోంది. కోకో గాఫ్ 2024లో 30 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదించి టెన్నీస్ లో అత్యధికంగా సంపాదించిన క్రీడాకారిణిగా నిలిచింది. ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ టెన్నిస్ ఆటగాళ్ళలో ఒకరిగా కోకో గాఫ్ స్థిరపడ్డాడు.
ఎలీన్ గు: 22.1 మిలియన్ డాలర్లు
కోకో గాఫ్ తర్వాత ఎలీన్ గు అత్యధికంగా సంపాదిస్తున్న ప్లేయర్ గా నిలిచారు. టాప్ ఫైవ్‌లో ఉన్న టెన్నీస్ ఏతర ప్లేయర్ ఎలీన్ గు ఒక్కరే కావడం విశేషం. ఫ్రీ స్టైల్ స్కీయర్ అయిన ఎలీన్ గు కోసం ఎండార్స్ మెంట్లు క్యూ కడుతున్నాయి. ఆమె 2024లో 22 మిలియన్ డాలర్లు ఆర్జించారు. చైనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎలీన్.. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఫ్యాషన్ మ్యాగజైన్ లపై దర్శనమిచ్చింది.
స్వైటెక్: 21.4 మిలియన్ డాలర్లు
డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైనందుకు సైటెక్ పై ఒక నెల సస్పెన్షన్ వేటు పడింది. అది ముగిసిన తర్వాత టెన్నిస్ లోకి మళ్లీ రంగ ప్రవేశం చేసిన స్వైటెక్.. 2024లో కీలక విజయాలు సాధించింది. ప్రస్తుతం టెన్నీస్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ టూగా మిగిలిపోయింది.
క్విన్వెన్ జెంగ్: 20.6 మిలియన్ డాలర్లు
చైనా నుంచి టెన్నిస్‌లో ఎదుగుతున్న స్టార్ క్విన్వెన్ జెంగ్. ఆమె ఈ ఏడాది 20 మిలియన్ డాలర్లు సంపాదించింది. 22 సంవత్సరాల వయస్సులో 15 మిలియన్ల డాలర్ల ఒప్పందం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో పతక విజేత అయిన ఆమె కోసం ఎండార్స్ మెంట్లు వరుస కడుతున్నాయి.
అరీనా సబలెంకా: 17.7 మిలియన్ డాలర్లు
ఆస్ట్రేలియా, అమెరికా ఓపెన్‌లలో గ్రాండ్ స్లామ్ విజయాలు సాధించిన సబలెంక 2024లో 17.7 మిలియన్ డాలర్లు సంపాదించింది. సబలెంకా టోర్నమెంట్లలో వచ్చిన ప్రైజ్ మనీతోనే $9.7 మిలియన్లతో అగ్రస్థానంలో నిలిచింది.