Kiran More on Hardik Pandya: హార్దిక్‌ పాండ్య ఇప్పుడు 4 డైమెన్షియల్‌ ప్లేయరని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ కిరణ్‌ మోరె అంటున్నాడు. అతడిలో ఎంతో పరిణతి కనిపిస్తోందని పేర్కొన్నాడు. మరింత మెరుగ్గా ఆడాలన్న కసి కనిపిస్తోందని వెల్లడించాడు. ఐపీఎల్‌ 2022లో అతడి మెరుపులు ఆకట్టుకున్నాయని తెలిపాడు.


'నా వరకైతే హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) చిన్న కుర్రాడు! ప్రతిసారీ రాణించాలని కోరుకుంటాడు. నేనిప్పుడు అతడిని 4డీ ఆటగాడని నమ్ముతున్నాను. ఇంతకు ముందు అతడు త్రీడీ ప్లేయర్‌గా ఉండేవాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేసేవాడు. ఇప్పుడు కెప్టెన్సీ సైతం చేస్తున్నాడు. అలాంటి క్రికెటర్‌ టీమ్‌ఇండియాకు ఆడుతున్నందుకు గర్వపడాలి' అని కిరణ్‌ మోరె అంటున్నాడు.


Also Read: హార్దిక్‌ పాండ్య - స్టేడియంలో తిరగబడిన సంగ్రామం వాడే!


హార్దిక్‌ పాండ్య చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనను మోరె గుర్తు చేసుకున్నాడు. కృనాల్‌ పాండ్యతో కలిసి అతడు తన అకాడమీకి వచ్చేవాడని పేర్కొన్నాడు. 'హార్దిక్‌ క్రికెట్‌ ఆడాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మొదట కృనాల్‌ నా అకాడమీలో చేరాడు. అతడితో పాటు హార్దిక్‌ వచ్చేవాడు. నెట్స్‌ వెనకాలే పరుగెత్తుతూ క్యాచులు అందుకుంటూ ఉండేవాడు. అప్పుడే నేను హార్దిక్‌ను నెట్స్‌ ప్రాక్టీస్‌కు తీసుకురావాలని కృనాల్‌కు చెప్పాను. అతడి కళ్లలో ఆకలి గమనించాను' అని మోరె వివరించాడు.


ఐపీఎల్‌ 2022లో హార్దిక్‌ పాండ్య ఆటతీరు అందరికీ సర్‌ప్రైజ్‌ చేసింది. నాలుగో స్థానంలో వచ్చి 487 పరుగులు చేశాడు. బంతితోనూ ఆకట్టుకున్నాడు. అంతకు మించి అతడి కెప్టెన్సీ అద్దిరిపోయింది. సరైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టును తొలి సీజన్లోనే విజేతగా నిలిపాడు. ఇప్పుడు టీమ్‌ఇండియాకు కీలకంగా మారనున్నాడు.


Also Read: రాహుల్‌ + రాహుల్‌ = 3 తలనొప్పులు!