ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 


ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. ఈ చిత్ర నిర్మాత, టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ 'ఆదిపురుష్' అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు. 


ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రభాస్ రేంజ్ అంటే అదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా ఈ ఏడాది ఆగ‌స్ట్ 11న ఈ సినిమాను విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీస్తున్నారట. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. 


Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు