రవణ స్టోర్స్‌ యాడ్‌ చూసిన వాళ్లెవరైనా ఠక్కున గుర్తు పట్టేస్తారీ వ్యక్తిని. తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోటానికి వేరెవరో ఎందుకని తానే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు శరవణ స్టోర్స్ అధినేత్ శరవణన్. హీరోయిన్లతో ఆడుతూ పాడుతూ చాలా గ్రాండ్‌గా యాడ్స్‌ చేయటం ఈయన ప్రత్యేకత. బుల్లి తెర మీద కనిపిస్తే చాలదు.. వెండితెర మీద కూడా మెరవాలి అనుకున్నాడో ఏమో.. వెంటనే హీరోగా డెబ్యూ ప్రాజెక్ట్‌ మొదలు పెట్టాడు. సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమా టైటిల్ "ది లెజెండ్".


మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆయన తనకు తానుగానే పేరు ముందు "లెజెండ్" అనే ట్యాగ్ పెట్టుకున్నాడు. అదే పేరుతో సినిమా కూడా చేశాడు.  దీన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తుండటం మరో హైలైట్. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్‌కి ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లంతా రావటమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పూజా హెగ్డే, హన్సిక, తమన్నా, లక్ష్మీ రాయ్, డింపుల్ హయాతి లాంటి హీరోయిన్లు శరవణన్ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి రావటంపై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో వీరికి పారితోషికం ఇచ్చాడని అందుకే వీళ్లంతా ఈ ఈవెంట్‌కి వచ్చేందుకు ఒప్పుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఇందులో ఎంత వాస్తవముందన్నది పక్కన పెడితే తొలి సినిమాతోనే లైమ్‌లైట్‌లోకి వచ్చేశాడు లెజెండ్ శరవణన్.  


ట్రెండింగ్‌లో ది లెజెండ్ మూవీ ట్రైలర్‌ 


యాడ్‌లో కనిపిస్తేనే శరవణన్ గురించి  జనం రకరకాలుగా మాట్లాడుకున్నారు. స్టార్స్‌తో యాడ్ షూట్ చేయించుకోవచ్చు కదా అని పెదవి విరిచారు. కానీ ఆయన ఏకంగా సినిమా హీరో అవతారమెత్తే సరికి అంతా ఆశ్చర్యపోయారు. సినిమా ఫస్ట్ లుక్‌ నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్‌ విడుదలై కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాపై జనాలు ఎంత ఆసక్తిగా చూపిస్తున్నారో తెలుసుకోటానికి. భారీ యాక్షన్ సీన్లు, సెట్టింగ్‌లు చూస్తుంటే సినిమా కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టినట్టు అర్థమవుతోంది.


సైంటిస్ట్‌ పాత్రలో శరవణన్ యాక్టింగ్‌ తేలిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ట్రైలర్‌కి వ్యూస్ మాత్రం తగ్గటం లేదు. శరవణన్ హీరోగా ఎలా చేశాడో, అసలు సినిమాలో ఏముందో అని తెలుసుకోవాలన్న ఆసక్తితో ట్రైలర్‌ని చూస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు ఓ బట్టల షాప్ ఓనర్‌గానే అందిరికీ సుపరిచితమైన 51 ఏళ్ల శరవణన్‌ హీరో ఇమేజ్ సంపాదించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే తన తొలి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనే రెండో సినిమానీ అనౌన్స్ చేశాడు ఈ లెజెండ్ శరవణన్. ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉండేదని, నటించాలనేకలని ఇన్నాళ్లకు తీర్చుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. 



‘ది లెజెండ్’ మూవీ ట్రైలర్: