జ్వాలతో ఎందుకు తిరుగుతున్నావెందుకూ అని ప్రశ్నించిన స్వప్నకు గట్టిగానే సమాధానం చెప్తాడు నిరుపమ్. నాకు కారు ఇష్టమైతే కారులో... ఆటో ఇష్టమైతే ఆటోలో వెళ్తానంటాడు. ఆటో వాళ్లతో ఫ్రెండ్‌షిప్ చేస్తానంటాడు. ఆటో అంటే నాకు ఇష్టమని చెప్పి వెళ్లిపోతాడు నిరుపమ్. నిరుపమ్ చెప్పిన సమాధానానికి షాక్ తింటుంది స్వప్న.
ఇదంతా విన్న జ్వాల మనసులో కాస్త సంతోషంగా ఉన్నప్పటికీ... ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతుంది. ఏం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్.
జ్వాల ప్రస్తుతం ఫ్యామిలీకి సంబంధించిన సమాచారాన్ని శాంతాభాయ్ శోభకు చెబుతుంది. జ్వాల పిన్నీ బాబాయ్ దొంగతనాలు చేసి బతికేవారని చెబుతుంది. ఇప్పుడు మాత్రం వంటలు చేస్తున్నారని... వాళ్లు మాత్రం దొంగలేనని చెబుతుంది. దీంతో శోభ ఎగిరి గంతేస్తుంది. మంచి సమాచారం ఇచ్చావంటుంది.
ఈ విషయం తెలిసిన శోభ... జ్వాలా ఇన్నాళ్లకు దొరికావ్ అంటుంది. దీన్ని వాడుకోకుండా ఎలా ఉంటానంటుంది. పొగరు చూపిస్తూ కనిపించిన ప్రతి సారీ డామినేట్ చేయాలని చూస్తావా... దీన్ని వాడుకొని నీ సంగతి చెప్తానంటుంది శోభ.
మనసులో ఏముందో చెప్పమని హిమను ప్రెజర్ చేస్తారు నాన్నమ్మ, తాతయ్య. కన్నవారికి ఆత్మశాంతి... మాకు మనశ్సాంతి లేకుండా చేస్తున్నావని అనుకుంటారు. అమ్మానాన్న అనుకున్నదే చేస్తున్నానంటూ మనసులో అనుకుంటుంది హిమ.
తాను రికార్డ్ చేసిన వీడియోను హిమకు సెండ్ చేస్తాడు ప్రేమ్.
ఇక్కడ తాతాయ్య, నాన్నమ్మ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న టైంలో... ప్రేమ్ నుంచి మెసేజ్ వస్తుంది.
అంతే కోపంతో ఫోన్ నేలకేసి కొడుతుంది. నన్నేమీ అడగొద్దని చెప్పి వెళ్లిపోతుంది.
ఇవేమీ తెలియని ప్రేమ్... హిమ రిప్లై కోసం ఎదురు చూస్తుంటాడు. త్వరగా రిప్లై ఇస్తే బాగున్నూ అనుకుంటాడు.
నిరుపమ్.. జ్వాల ఆటో కూర్చొని... హిమ, స్వప్న, తన పెళ్లిపై జరుగుతున్న వివాదం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన జ్వాల... ఈ మధ్య చాలా డల్‌గా ఉంటున్నారని... దేని కోసమే ఆలోచిస్తున్నారని ప్రశ్నిస్తుంది. నేనేమైనా హెల్ప్ చేయగలనా అంటుంది. ఏమైందో చెప్పమని అడుగుతుంది. సమయం వచ్చినప్పుడు చెప్తానని.... అందులో నువ్వు కూడా హెల్ప్ చేయాల్సి ఉంటుందని అంటాడు నిరుపమ్. ఇప్పుడు ఏమీ చెప్పలేనని... నీతో కాసేపు అలా ఆటోలో తిరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటాడు నిరుపమ్. రెస్టారెంట్‌కు వెళ్లి కాఫీ తాగుతూ మాట్లాడదామంటుంది జ్వాల. వద్దంటాడు నిరుపమ్. ఎక్కడికీ వెళ్లొద్దని అంటాడు నిరుపమ్.
ఇక్కడ ప్రేమ్ తన ప్రేను హిమ ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. తాను పంపిన వీడియో గురించి థింక్ చేస్తుంటాడు. ఇంకా హిమ వీడియో చూడకపోవడం ఏంటి అనుకుంటాడు. హిమకు ఫోన్ చేసి తాను పంపిన వీడియో ఇంకా చూడలేదని అడిగితే ఎలా ఉంటుందని అనుకుంటాడు. ఫోన్ చేయబోతూ.... అలా అడిగితే బాగోదని అనుకుంటాడు.
ఆసుపత్రిలో కూర్చొని ఉన్న హిమకు శోభ ఫోన్ చేసి పార్టీకి రమ్మంటుంది. నిరుపమ్, హిమ నువ్వు కలిసి రావాలని ఆహ్వానిస్తుంది. అలాగే జ్వాలను కూడా తీసుకొని రమ్మంటుంది శోభ. స్వప్న కూడా వస్తుందని చెబుతుంది శోభ. ఇప్పుడు ఈ పార్టీలో ఏం జరగబోతుందని అనుమానపడుతుంది హిమ. నాన్నమ్మ చేసినట్టు స్వప్న ఏదైనా సర్‌ప్రైజ్ ఇస్తుందా అని అనుకుటుంది. ఈ ఫంక్షన్‌లో బావను, సౌర్యను కలిపే అవకాశం దొరికితే బాగుండు అనుకుంటుంది.
జ్వాల పిన్ని, బాబాయ్ ఓ పెద్ద హోటల్‌కు వస్తారు. అక్కడే జ్వాల ఉంటుంది. వాళ్లను చూస్తుంది. అదే హోటల్‌లో పని ఉందని తెలుసుకొని మేనేజర్‌తో మాట్లాడుతుంటారు. రోజుకు వెయ్యి రూపాయలు తీసుకొని పని చేసేందుకు అంగీకరిస్తారు.
ఓ ఇంట్లో ఫంక్షన్ ఉందని... చెప్పి పంపిస్తాడా మేనేజర్. దొంగ మొగుడు పెళ్లాలను అడ్డుపెట్టుకొని జ్వాల అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది శోభ.
జ్వాల ఆటో తుడుస్తూ ఉంటే... బాబాయ్ వచ్చి తనకు పని దొరికిందని చెప్తాడు. క్యాటరింగ్‌కు వెళ్తున్నామని చెప్తాడు. చేతి వాటం ప్రదర్శించుకుండా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది జ్వాల.
జ్వాలను దెబ్బ తీసేందుకు వేసిన ప్లాన్ గురించి స్వప్నతో పంచుకుంటుంది. బాబాయ్, పిన్ని బాగోతాన్ని అందరి ముందూ చెప్పి జ్వాల, నిరుపమ్ ఫ్రెండ్‌షిప్ కట్‌చేయాలనుకుంటారు. ఇవాళ్టితో జ్వాల పొగరు అణచివేస్తామంటారు. జ్వాల అడ్డంకి తొలగిపోతుందని చెబుతుంది శోభ.