ఫిఫా వరల్డ్ కప్‌లో తన ప్రస్థానాన్ని ఈక్వెడార్ విజయంతో ప్రారంభించింది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఖతార్‌పై 2-0తో ఘన విజయం సాధించింది. ఈ రెండు గోల్స్‌ను ఎన్నెర్ వాలెన్షియా సాధించాడు. అసలు ఆట మొదటి అర్థభాగంలోనే రెండు గోల్స్ కొట్టిన ఈక్వెడార్ గేమ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది.


12వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మార్చిన వాలెన్షియా, 31వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మార్చి రెండో గోల్‌ను కూడా అందించాడు. దీంతో ఈక్వెడార్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఖతార్ గోల్ కొట్టడానికి ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఫలించలేదు.


ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఈక్వెడార్ 44వ స్థానంలో ఉండగా, ఆతిథ్య ఖతార్ 50వ స్థానంలో ఉంది. ఈక్వెడార్ తరఫున ఫిఫా వరల్డ్ కప్‌లో గత నాలుగు గోల్స్ కొట్టింది ఎన్నెర్ వాలెన్షియానే కావడం విశేషం.


ఖతార్ జట్టు
సాడ్, పెడ్రో, బస్సామ్, ఖౌకీ, అబ్దెల్ కరీమ్, హోమమ్, అల్-హేడోస్, కరీం, అజీజ్, అఫీఫ్, అల్మోజ్


ఈక్వెడార్ జట్టు
గలిండెజ్, ప్రీసియాడో, టోరెస్, హిన్‌క్యాపీ, ఎస్టూపినాన్, ప్లాటా, మెండెజ్, కైకెడో, ఇబార్రా, వాలెన్షియా, ఎస్ట్రాడా