FIFA WC 2022: ఫిఫా ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌లోని చివరి నాలుగు మ్యాచ్‌లు నేడు (సోమవారం) జరగనున్నాయి. గ్రూప్-జి మరియు గ్రూప్-హెచ్ జట్లు మ్యాచులు ఆడనున్నాయి. రౌండ్ ఆఫ్ 16 కు ముందు కొన్ని జట్లకు ఇవి ముఖ్యమైనవి. నాలుగు పెద్ద జట్లు 2 మ్యాచులలో తలపడనున్నాయి. బ్రెజిల్- స్విట్జర్లాండ్, పోర్చుగల్- ఉరుగ్వేలు పోటీపడనున్నాయి.
1. కామెరూన్ వర్సెస్ సెర్బియా: ఈ రెండు జట్లు తమ మొదటి మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. కామెరూన్ 1-0తో స్విట్జర్లాండ్ చేతిలో ఓడిపోగా, సెర్బియాను 2-0తో బ్రెజిల్ కంగుతినిపించింది. కాబట్టి నేటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఓడిన జట్టుకు నాకౌట్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.
2. రిపబ్లిక్ ఆఫ్ కొరియా వర్సెస్ ఘనా: తమ ముందు మ్యాచ్‌లో ఘనా జట్టు పోర్చుగల్ చేతిలో 3-2 తేడాతో ఓడిపోయింది. అయితే ఆ జట్టు గట్టి పోరాట పటిమను ప్రదర్శించింది. ఉరుగ్వేతో కొరియా మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్‌లో గట్టి పోటీ ఉండనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు జరగనుంది.
3. బ్రెజిల్ వర్సెస్ స్విట్జర్లాండ్: రెండు జట్లూ తమ మునుపటి మ్యాచ్‌లలో గెలిచాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఈ రెండింటి నాకౌట్ అవకాశాలు బలంగా మారతాయి. రెండు జట్లూ స్టార్ ఆటగాళ్లతో నిండి ఉన్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.
4. పోర్చుగల్ వర్సెస్ ఉరుగ్వే: గత మ్యాచ్‌లో ఘనాపై పోర్చుగల్ అతికష్టం మీద విజయం సాధించింది. మరోవైపు ఉరుగ్వే ఫార్వర్డ్‌లు కొరియా జట్టు డిఫెన్స్ లైన్‌లోకి దూసుకెళ్లడంలో విఫలమయ్యారు. క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ సువారెజ్ వంటి ఆటగాళ్లు వారిపై దృష్టి సారించనున్నారు.
మ్యాచ్ ఎక్కడ చూడాలి?
ఫిఫా ప్రపంచ కప్ 2022 యొక్క అన్ని మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18 ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. జియో సినిమా యాప్ లోనూ వీక్షించవచ్చు.