ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ శుభారంభం చేసింది. ఘనాతో జరిగిన తన మొదటి మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ 3-2తో విజయం సాధించింది. ఆట మొదటి భాగంలో రెండు జట్లూ గోల్ కొట్టడంలో విఫలం అయ్యాయి. అయితే 65వ నిమిషంలో స్టార్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో మొదటి గోల్ చేశాడు. ఈ గోల్‌తో వరుసగా ఐదు వరల్డ్ కప్‌ల్లో కనీసం ఒక గోల్ అయిన వేసిన ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు.


ఆ తర్వాత 73వ నిమిషంలో ఘనా ఆటగాడు ఆండ్రీ అయూ గోల్ కొట్టడంతో స్కోరు 1-1తో సమం అయింది. కానీ జోవావో ఫెలిక్స్, రఫెల్ లియావో వెంట వెంటనే గోల్స్ వేయడంతో పోర్చుగల్ 3-1తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆట 89వ నిమిషంలో ఘనా ఆటగాడు ఇనాకి విలియమ్స్ గోల్ కొట్టి పోర్చుగల్ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాడు.


ఈ గేమ్‌లో పోర్చుగల్ మొదటి నుంచి అటాకింగ్ మైండ్ సెట్‌తోనే ఆడింది. 10వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ ఇచ్చిన పాస్‌ను రొనాల్డో గోల్‌గా మార్చడానికి ప్రయత్నించాడు. కానీ ఘనా గోల్ కీపర్ లారెన్స్ అతి-జిగి దీన్ని సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత మూడు నిమిషాల్లోపే రొనాల్డో మళ్లీ గోల్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.


ఆట 31వ నిమిషంలో రొనాల్డో గోల్ కొట్టినప్పటికీ దాన్ని ఫౌల్‌గా పరిగణించి గోల్‌ను లెక్కించలేదు. సెకండాఫ్‌లో ఘనా అటాకింగ్ గేమ్‌తో ఆశ్చర్యపరిచింది. కానీ గోల్ కోసం వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 65వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మార్చిన రొనాల్డో పోర్చుగల్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.


అయితే 73వ నిమిషంలో ఆండ్రీ అయూ గోల్‌ను సాధించి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత జోవావో ఫెలిక్స్, రఫెల్ లియావో గోల్స్ సాధించారు. దీంతో పోర్చుగల్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ 89వ నిమిషంలో ఘనా ఆటగాడు ఇనాకి విలియమ్స్ గోల్ కొట్టడంతో పోర్చుగల్ ఆధిక్యం 3-2కు తగ్గింది.