Best FIFA Football Awards: ఆదివారం రాత్రి పారిస్ లో ఫిఫా అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఇతర ఫైనలిస్టులు కరీమా బెంజెమా, కైలియన్ ఎంబాపేలను ఓడించి మెస్సీ ఈ అవార్డును అందుకున్నాడు. గతేడాది ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ ను అర్జెంటీనా గెలుచుకుంది. ఆ జట్టు కెప్టెన్ మెస్సీ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రపంచకప్ విజయంలో ప్రధాన పాత్ర
ఫిఫా ప్రపంచకప్ పోటీల్లో మెస్సీ గోల్డెన్ బాల్ అవార్డును కూడా అందుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్ లో మెస్సీ మొత్తం 7 గోల్స్ చేశాడు. అలాగే సహచరులు గోల్స్ కొట్టడంలో సహకరించాడు. ఇక ఫైనల్ లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా తరఫున తన చివరి ప్రపంచకప్‌ను ఆడుతున్న లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కెరీర్‌ను అద్భుతమైన రీతిలో ముగించాడు. సాధారణ సమయంలో స్కోరు 2-2తో సమం కాగా, అదనపు సమయంలో స్కోరు 3-3తో సమమైంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది.
అలాగే గతేడాది తన క్లబ్ పీఎస్ జీ తరఫున కూడా లియోనెల్ మెస్సీ అద్భుతంగా రాణించాడు.
ఫిఫా బెస్ట్ వుమెన్స్ ప్లేయర్ అవార్డును స్పెయిన్ ఫార్వర్డ్ క్రీడాకారిణి అలెక్సియా పుటెల్లాస్ కు లభించింది. ఇంగ్లండ్ కు చెందిన బెత్ మీడ్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన అలెక్స్ మోర్గాన్ లను ఓడించి అలెక్సియా అవార్డును అందుకుంది. 2021లో కూడా ఈ అవార్డును అలెక్సియానే అందుకుంది.
ఫిఫా అవార్డు విజేతలు
- బెస్ట్ ఫిఫా ఉమెన్స్ గోల్ కీపర్: మేరీ ఇయర్ప్స్ (ఇంగ్లండ్, మాంచెస్టర్ యునైటెడ్)
- బెస్ట్ ఫిఫా పురుషుల గోల్ కీపర్: ఎమిలియానో మార్టినెజ్ (అర్జెంటీనా, ఆస్టన్ విల్లా)
- ఫిఫా పుస్కాస్ అవార్డు: మార్సిన్ ఒలెక్సీ
- ఉత్తమ మహిళా కోచ్: సరీనా విగ్మాన్ (ఇంగ్లండ్ మహిళల జాతీయ జట్టు కోచ్)
- ఉత్తమ పురుషుల కోచ్: లియోనెల్ స్కలోని (అర్జెంటీనా పురుషుల జట్టు కోచ్)
- ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు: లూకా లోచోష్విలి
- ఫిఫా ఫ్యాన్ అవార్డు: అర్జెంటీనా అభిమానులు
- 2022 ఫిఫా మహిళల ప్రపంచ XI: ఎండ్లర్, కాంస్య, లియోన్, విలియమ్సన్, రెనార్డ్, పుటెల్లాస్, వాల్ష్, ఒబెర్‌డార్ఫ్, మోర్గాన్, కెర్, మీడ్.
- 2022 ఫిఫా పురుషుల వరల్డ్ XI: కోర్టోయిస్, హకీమి, క్యాన్సెలో, వాన్ డిజ్క్, డి బ్రూయిన్, మోడ్రిక్, కాసెమిరో, మెస్సీ, ఎంబాపె, బెంజెమా, హాలాండ్.
- బెస్ట్ ఫిఫా ఉమెన్స్ ప్లేయర్: అలెక్సియా పుటెల్లాస్ (స్పెయిన్, FC బార్సిలోనా)
- దబెస్ట్ ఫిఫా పురుషుల ప్లేయర్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా, పారిస్ సెయింట్-జర్మైన్)