Year Ender 2022: భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఈ ఏడాది టాప్-5 టీ20 అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్‌లను ఎంచుకున్నాడు. ఇందులో జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌తో పాటు భారత బ్యాట్స్‌మెన్‌ను కూడా చేర్చాడు. అతని జాబితాలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, సికందర్ రజా, డెవాన్ కాన్వే ఉన్నారు. తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఈ జాబితాను విడుదల చేశాడు. ఈ లిస్ట్‌లో ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో చూద్దాం.


1.సూర్యకుమార్ యాదవ్
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆకాష్ చోప్రా నంబర్ వన్ స్థానంలో నిలిపాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో సూర్యకి ఇది గొప్ప సంవత్సరం. అతను 2022లో మొత్తం 31 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 46.5 యావరేజ్, 187 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సూర్య నిలిచాడు.


2.మహ్మద్ రిజ్వాన్
ఆకాష్ చోప్రా ఈ జాబితాలో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌ను రెండో స్థానంలో ఉంచాడు. రిజ్వాన్ ఈ ఏడాది 25 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 45.2 సగటుతో 123 స్ట్రైక్ రేట్‌తో 996 పరుగులు చేశాడు.


3.విరాట్ కోహ్లీ
ఆకాష్ చోప్రా లిస్ట్‌లో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. అతను ఈ సంవత్సరం 20 T20 ఇంటర్నేషనల్స్‌లో 55.7 సగటు, 138 స్ట్రైక్ రేట్‌తో 781 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఆడిన T20 ప్రపంచ కప్‌లో కోహ్లీ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేశాడు.


4.సికందర్ రజా
ఈ సందర్భంలో అతను జింబాబ్వే స్టార్ బ్యాట్స్‌మెన్ సికందర్ రజాకు నాలుగో ర్యాంక్ ఇచ్చాడు. ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో 24 మ్యాచ్‌లలో 35 సగటుతో, 151 స్ట్రైక్ రేట్‌తో రజా 735 పరుగులు చేశాడు.


5.డెవాన్ కాన్వే
ఆకాష్ చోప్రా కివీస్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వేని తన జాబితాలో ఐదో స్థానంలో ఉంచాడు. కాన్వే ఈ ఏడాది 15 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. 47.3 సగటు, 122 స్ట్రైక్ రేట్‌తో 568 పరుగులు చేశాడు.