WPL 2023:  ఎన్నో అంచనాల నడుమ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ ఈ ఏడాది మార్చిలో జరగనుంది. ఈ లీగ్ భారత్ లో మహిళల క్రికెట్ లో విప్లవం తీసుకువస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్, దేశంలో మహిళల క్రికెట్ ను మరింత ప్రోత్సహించేలా ఈ టోర్నమెంట్ సహకరిస్తుందని వారు అంటున్నారు. మరి ఈ డబ్ల్యూపీఎల్ వేలం ఎప్పుడు? ఎంతమంది ప్లేయర్లు వేలంలో ఉన్నారు? అక్షన్ ఎక్కడ జరగబోతోంది? లాంటి విషయాలు తెలుసుకుందాం రండి. 


ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ ఎడిషన్ లో మొత్తం 5 జట్లు భాగం కానున్నాయి. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు ఈ లీగ్ లో ఆడనున్నాయి. డబ్ల్యూపీఎల్ మార్చి 4న ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ మార్చి 26న జరుగుతుంది. 


మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?


ఈ లీగ్ ఫిబ్రవరి 13న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆక్షన్ ప్రారంభమవుతుంది. 


డబ్ల్యూపీఎల్ వేలం ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ అవుతుంది?


డబ్ల్యూపీఎల్ వేలం స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ ఛానళ్లలో ప్రసారం అవుతుంది. అలాగే జియో సినిమా యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 


మహిళల ప్రీమియర్ లీగ్ లో అత్యధిక, అత్యల్ప బేస్ ధర ఎంత?


డబ్ల్యూపీఎల్ లో క్యాప్డ్ ప్లేయర్ అత్యధిక బేస్ ధర రూ. 50 లక్షలు, అత్యల్ప ధర రూ. 30 లక్షలు. అలాగే అన్ క్యాప్డ్ ప్లేయర్ అత్యధిక బేస్ ధర రూ. 20 లక్షలు. అత్యల్ప బేస్ ధర రూ. 10 లక్షలు. 






డబ్ల్యూపీఎల్ జట్ల వేలం పర్స్ ఎంత? ఎంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు?


ఈ వేలంలో ఒక్కో జట్టు రూ. 12 కోట్ల వరకు ఖర్చు పెట్టవచ్చు. ఒక్కో జట్టు గరిష్టంగా 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చు. అందులో 6 గురు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. ఒక్కో జట్టు కనీసం 15 మందిని తీసుకోవాలి. 


మహిళల ప్రీమియర్ లీగ్ వేలం కోసం ఎంత మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు?


ప్రారంభ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కోసం మొత్తం 1525 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. 409 మంది ఆటగాళ్లు తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు.


మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఎన్ని జట్లు ఉన్నాయి మరియు యజమానులు ఎవరు?


మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో మొత్తం 5 జట్లు ఉన్నాయి. అదానీ గ్రూప్ (గుజరాత్ జెయింట్స్), రిలయన్స్ ఇండస్ట్రీస్ (ముంబై ఇండియన్స్), డియాజియో (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), JSW గ్రూప్-GMR గ్రూప్ (ముంబై ఇండియన్స్) మరియు కాప్రి గ్లోబల్ (UP వారియర్స్).


మహిళల ప్రీమియర్ లీగ్ జట్ల కోచ్‌లు ఎవరు?


జనాథన్ బట్టీ (ఢిల్లీ క్యాపిటల్స్), షార్లెట్ ఎడ్వర్డ్స్ (ముంబై ఇండియన్స్), రాచెల్ హేన్స్ (గుజరాత్ జెయింట్స్) జోన్ లూయిస్ (యూపీ వారియర్స్). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా తమ కోచ్‌ని ప్రకటించలేదు.