భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాయి. ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో టీమిండియా స్టార్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లోని ప్రదర్శన ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఎంపిక చేసింది. ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. కానీ భారత జట్టు నుంచి నలుగురు స్టార్లకు స్థానం దక్కింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. 12 మంది సభ్యుల జట్టులో మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలతో పాటు సారధిగా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.
క్రికెట్ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ జట్టు:
విరాట్ కోహ్లీ, కెప్టెన్ (టీమిండియా): ఈ మహా సంగ్రామంలో విరాట్ కోహ్లీ 99.00 సగటుతో మరియు 88.50 స్ట్రైక్ రేట్‌తో 594 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ టోర్నీలో ఇప్పటివరకు 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమ స్కోరు 103 నాటౌట్.
క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా): 9 మ్యాచ్‌ల్లో డి కాక్ 65.67 సగటుతో 591 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో 4 సెంచరీలు చేశాడు. డికాక్ సగటు 109.2. అత్యధిక స్కోరు 174.
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా): ఓపెనింగ్ బ్యాటింగ్ 9 మ్యాచ్‌ల్లో 55.44 సగటుతో.. 105.5 స్ట్రైక్ రేట్‌తో 499 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో 2 సెంచరీలు చేశాడు. 2 అర్ధశతకాలు సాధించాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు 163 పరుగులు.
రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్): 9 మ్యాచ్‌ల్లో 70.63 స్ట్రైక్ రేట్‌తో 565 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమం 123 నాటౌట్. 5.68 ఎకానమీ రేటుతో 5 వికెట్లు కూడా సాధించాడు.
ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా): మార్క్రామ్ 49.50 సగటుతో మరియు 114.50 స్ట్రైక్ రేట్‌తో 396 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యుత్తమం 106 పరుగులు.
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్. 7 మ్యాచ్‌ల్లో 152.7 స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో మ్యాక్సీ రెండు సెంచరీలు చేశాడు. అత్యుత్తమం 201 నాటౌట్. 4.95 ఎకానమీ రేటుతో 5 వికెట్లు కూడా తీశాడు.
మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా): 8 మ్యాచ్‌ల్లో 111.3 స్ట్రైక్‌రేట్‌తో 157 పరుగులు చేశాడు. ఒక అర్ధ సెంచరీ కూడా చేశాడు. బంతితో 6.40 ఎకానమీ రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు.
రవీంద్ర జడేజా (భారత్): భారత ఆల్‌రౌండర్. 9 మ్యాచ్‌ల్లో 115.6 స్ట్రైక్ రేట్‌తో 111 పరుగులు చేశాడు. 3.96 ఎకానమీ రేట్‌తో ఇప్పటివరకు 16 వికెట్లు సాధించాడు.
మహ్మద్ షమీ (భారత్): కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ, షమీ ఈ ప్రపంచకప్‌లో 4.78 ఎకానమీ రేటుతో 16 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అతను రెండుసార్లు 5 వికెట్లు కూడా సాధించాడు.
ఆడమ్ జంపా(ఆస్ట్రేలియా): ఆసీస్ స్పిన్నర్ 9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 5.27 ఎకానమీ రేటును కూడా కలిగి ఉన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా (భారత్): బుమ్రా ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు(17) తీసిన ఆటగాళ్లలో ఒకడు. అతను 3.65 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.
దిల్షాన్ మధుశంక(శ్రీలంక): మధుశంక 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 6.70గా ఉంది.