World Cup 2023: వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం మరో ఆసక్తిపోరు జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. రెండు వరుస విజయాలతో కివీస్ జట్టు ఊపు మీద ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం ఒక ఓటమితో బంగ్లాదేశ్ కాస్త ఒత్తిడిలో ఉంది.
స్లో చెపాక్ పిచ్‌పై బంగ్లాదేశ్ సమర్థవంతమైన స్పిన్ దాడి ఉంటుందని గ్రహించిన న్యూజిలాండ్ అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ మరో విజయంతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కివీస్ నాలుగు పాయింట్లతో 1.958 నెట్ట్ రన్ రేట్ కలిగి ఉంది. ఇండియా కూడా నాలుగు పాయింట్లతో 1.5 నెట్ట్ రన్ రేట్ కలిగి ఉంది. పాకిస్తాన్ 0.92 నెట్ట్ రన్ రేట్ కలిగి ఉంది.
మొన్నటి వరకు జట్టుకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడం వారి బలాన్ని మరింత పెంచుతోంది. అదే టైంలో సీనియర్ పేసర్ టిమ్ సౌతీని బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌కు ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండు మార్పులు కివీస్ విజయాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి. ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌తో జరిగిన కివీస్ మ్యాచ్‌లకు విలియమ్సన్ సౌతీ దూరంగా ఉన్నారు. ఆ టైంలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ బాధ్యతలు తీసుకున్నాడు.
వీళ్లిద్దరి రాకతో కివీస్‌కి సెలక్షన్ ప్యానెల్ డైలమాలో పడింది. విలియమ్సన్ గైర్హాజరీలో నెంబర్ 3లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు రచిన్ రవీంద్ర. వీళ్లిద్దరు రాకతో ఎవరిని జట్టు నుంచి తప్పించాలనేది వారికి తలనొప్పిగా మారనుంది. న్యూజిలాండ్ తమ టాప్-ఆర్డర్ బ్యాటర్లు విల్ యంగ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం ఎలాంటి మార్పులు చేసినా భయం లేదు.
చెపాక్ స్టేడియంలో పరుగులు రాబట్టడం అంత ఈజీగా రావని తెలుస్తోంది. మొన్నటికి మొన్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 200 పరుగులు చేయడమే కష్టంగా మారింది. ఆ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఆరు వికెట్లు పడగొట్టారు. అందుకే ఇరు జట్లు ఇదే ఫార్ములాను పాలో అయ్యే ఛాన్స్ ఉంది.
చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ కివీస్‌తో తలపడడం బంగ్లాదేశ్‌కు కాస్త ఒత్తిడితో కూడిన విషయమే. స్పిన్ త్రయం కెప్టెన్ షకీబ్ అల్ హసన్, మహేదీ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ అద్భుతం చేయవచ్చని ఆలోచిస్తోంది. వీళ్లు గత రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టారు. ఈ ముగ్గిరిపైనే బంగ్లాదేశ్ ఆశలు పెట్టుకొని ఉంది. బంగ్లాదేశ్‌కు షకీబ్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, నజ్ముల్ శాంటో వంటి సీనియర్ బ్యాటర్‌లు అద్భుతం చేయాలని దానికి తోడు స్పిన్ త్రయం రాణించాలని కోరుకుంటోంది బంగ్లాదేశ్.
ఈ రెండు జట్లు వన్డేల్లో 41 సార్లు తలపడగా, న్యూజిలాండ్ 30 సార్లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 10 సార్లు విజయం సాధించింది.
బంగ్లాదేశ్ జట్టు ఇలా ఉండొచ్చు: షకీబ్ అల్ హసన్ (c), లిట్టన్ దాస్ (wk), తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (vc), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (wk), మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తాస్కిన్ హసన్, అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (c), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే (WK), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (WK), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ (wk), రాచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్ , ఇష్ సోథీ, టిమ్ సౌతీ, విల్ యంగ్.