Indian Air Forces Air Show In World Cup 2023 : భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌(World Cup 2023) తుది అంకానికి చేరుకుంది. గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియా(Australia )తో టీమిండియా(Team India) అమీతుమీ తేల్చుకోనుంది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయిన ఆస్ట్రేలియన్లను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అయితే ఈ తుది పోరును ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్‌ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ(BCCI) వైభవంగా నిర్వహించనుంది. అతిరథ మహారథుల మధ్య ఈ మ్యాచ్‌ను కన్నులపండువగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 19న గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ( Narendra Modi Stadium)లో జరిగే భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌ (Bharat Australia Final Match) ను చూసేందుకు ప్రధాని మోదీ స్టేడియానికి వస్తారని తెలుస్తోంది. తుదిపోరుకు ఆయన ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 


భారత్‌ వేదికగా నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. కాబట్టి ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే ముగింపు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేలా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ పది నిమిషాల పాటు అహ్మదాబాద్‌ స్టేడియంలో ఎయిర్ షో నిర్వహించనున్నట్లు గుజరాత్ డిఫెన్స్ పీఆర్‌వో వెల్లడించారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌లో మొత్తం తొమ్మిది ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉంటాయి. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ కుషీలో ఉన్నారు. ప్రధాని మోదీ ఫైనల్ మ్యాచుకు వస్తారని విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తొలి సెమీఫైనల్‍లో న్యూజిలాండ్‍పై భారత్ 70 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత భారత జట్టును అభినందిస్తూ ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు. మెన్ ఇన్ బ్లూను కొనియాడుతూ ట్వీట్ చేశారు. వన్డేల్లో 50 శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీని సైతం.. ప్రధాని మోదీ అభినందించారు.


సెమీ ఫైనల్స్ లో గెలిచి రికార్డులు కొల్లగొట్టిన టీం ఇండియా పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు. 113 బంతుల్లో 117 రన్స్ సాధించాడు. ఈ ఘనత సాధించినందుకు విరాట్ కోహ్లీకి ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi) తో సహా పలువురు వారి సోషల్ మీడియా అకౌంటు ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభినందనలు తెలియజేశారు.


 కింగ్ విరాట్ కోహ్లీకిప్రధాని నరేంద్ర మోడీ, 50వ సెంచరీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీ తన 50 సెంచరీని సాధించమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి నిర్వచించే పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడన్నారు. ఈ అద్బుతమైన మైలురాయి, అతని నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం మన్నారు. కోహ్లీ భవిష్యత్ తరాలకు ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసాడంటూ ట్వీట్ చేశారు. అలాగే టీమిండియాకు తన అభినందనలు తెలిపారు. టీం గానే కాదు వ్యక్తిగతంగా కూడా అద్భుతాలు ఆవిష్కరించిన షమీ కి కూడా అభినందనలు తెలిపారు.