Virat Kohli:  విరాట్ కోహ్లీ... మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. బ్యాటింగ్ అయినా.. ఫీల్డింగ్ అయినా తన బాడీ లాంగ్వేజ్ తో అభిమానులను అలరిస్తుంటాడు. అలాగే స్టేడియంలో ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంటాడు. అలాగే కోహ్లీకి దేశ భక్తీ ఎక్కువే. ప్రపంచంలోనే మేటి క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ దేశం మీద ప్రేమ, గౌరవం చూపించడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. అలాంటి ఓ ఘటనే భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో జరిగింది.


భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ సందర్భంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పుడు మైదానంలో ప్రేక్షకులు కోహ్లీని ఉద్దేశించి ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ అరవడం మొదలుపెట్టారు. అది విన్న కోహ్లీ తన జెర్సీపై ఉన్న ఇండియా లోగోను చూపిస్తూ.. ఆర్సీబీ కాదు ఇండియా అంటూ అరవండి అని అభిమానులకు సూచించాడు. తర్వాత ఫ్యాన్స్ కూడా ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు విరాట్ ను ప్రశంసిస్తున్నారు. కోహ్లీ నువ్వు సూపర్, గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. 


ఇక ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. 






విరాట్ కోహ్లీకి ఇష్టం లేని కూర అదే!


విరాట్‌ కోహ్లీ అంటే గుర్తొచ్చేది ఫిట్‌నెస్‌! తన దేహాన్ని పటిష్ఠంగా ఉంచుకొనేందుకు అతడెంతో శ్రమిస్తాడు. గంటల కొద్దీ జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. అలాగే అతడు ప్రాధాన్యం ఇచ్చే మరో అంశం ఆహారం.


టీమ్‌ఇండియా కింగ్‌ విరాట్ (Virat Kohli) మంచి ఆహార ప్రియుడు! ఏ దేశానికి వెళ్లినా స్థానిక వంటకాలను రుచి చూస్తుంటాడు. దేహ దారుఢ్యాన్ని పెంచే ఆహార పదార్థాలకే ఓటేస్తాడు. 'చోలె బాతుర్‌' కనిపిస్తే మాత్రం ఆగలేడు. అలాగే అతడికి ఇష్టం లేని, అస్సలు తినని కూరేంటో అభిమానులతో పంచుకున్నాడు.


ఆస్ట్రేలియాపై రెండో టెస్టు (IND vs AUS 2nd Test) గెలిచాక విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' సెషన్‌ నిర్వహించాడు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. తానిప్పుడు శాకహారినని పేర్కొన్నాడు. తన జీవితంలో తినని ఒకేఒక్క కూరగాయ 'కాకర కాయ' అని వివరించాడు.4