IPL 2023:
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు గుడ్‌న్యూస్! ఆ జట్టు ప్రధాన పేసర్ దీపక్ చాహర్ (Deepak Chahar) 100 శాతం ఫిట్‌నెస్ సాధించాడు. సరికొత్త సీజన్‌కు సంసిద్ధంగా ఉన్నాడు. చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్‌ను అలరిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 కోసం ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. పీటీఐతో అతడు మాట్లాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఒకటి! ఏకంగా నాలుగు సార్లు విజేతగా ఆవిర్భవించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో చక్కని సమతూకం ఉండటమే ఇందుకు కారణం. గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ధోనీసేన దారుణ పరాభవానికి గురైంది. సరైన బౌలర్లు లేకపోవడంతో ఇబ్బంది పడింది. ప్రధాన పేసర్ దీపక్ చాహర్ గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. స్ట్రెస్ ఫ్రాక్చర్, క్వాడ్ గ్రేడ్ 3 టియర్‌తో అంతర్జాతీయ క్రికెట్టూ ఆడలేదు.
ఐపీఎల్ తర్వాత కోలుకున్న దీపక్ చాహర్‌ను సెలక్టర్లు బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. మూడు ఓవర్లు వేయగానే మళ్లీ గాయపడ్డాడు. మొత్తంగా 2022లో 15 మ్యాచులే ఆడాడు. టీ20 ప్రపంచకప్‌నకూ అందుబాటులో లేడు. ఈ మధ్యే రంజీ మ్యాచ్ (Ranji Trophy) ఆడాడు. ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నాడు.
'ఫిట్‌నెస్ కోసం రెండు మూడు నెలలుగా కఠోర సాధన చేస్తున్నాను. ఇప్పుడు వంద శాతం ఫిట్‌గా మారాను. ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాను. నాకు రెండు పెద్ద గాయాలయ్యాయి. ఒకటి స్ట్రెస్ ఫ్యాక్చర్. రెండోది క్వాడ్ గ్రేడ్ 3 టియర్. ఇవి రెండూ పెద్దవే కావడంతో కొన్ని నెలలు క్రికెట్‌కు దూరమయ్యాను. గాయం తర్వాత పునరాగమనానికి సమయం పడుతుంది. ఫాస్ట్ బౌలర్లకు ఇంకా ఎక్కువ సమయం అవసరం' అని చాహర్ అన్నాడు.
'నేను బ్యాటర్ అయ్యుంటే ఎప్పుడో పునరాగమనం చేసేవాడిని. స్ట్రెస్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్లకు చాలా కష్టం. తిరిగి పట్టాలెక్కడం చాలా కష్టం. ఇతర బౌలర్లూ వెన్ను నొప్పితో బాధపడటం తెలిసిందే. నాది ఒకే నియమం. నేను కోరుకున్నట్టుగా బౌలింగ్, బ్యాటింగ్ చేస్తే నన్నెవరూ ఆపలేరు. ఈ నియమంతోనే నేను కెరీర్ ఆరంభించాను. ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడటం లేదో నేను పట్టించుకోను. పూర్తిగా ఫిట్‌నెస్ సాధించి 100 శాతం బ్యాటింగ్, బౌలింగ్ చేయడమే నా లక్ష్యం. ఆ పని చేస్తే అవకాశాలు వస్తాయి' అని దీపక్ చాహర్ అన్నాడు. ఈ మధ్యే అతడు పోటీ క్రికెట్ ఆడాడు. గత నెల్లో సర్వీసెస్‌పై ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు.