Virat kohli Fitness Secrete: విరాట్ కోహ్లీ.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. 70 అంతర్జాతీయ సెంచరీలతో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతమున్న క్రికెటర్లలో విరాట్ కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఏ ఫార్మాట్ లో చూసుకున్నా కోహ్లీ గణాంకాలు ఉత్తమంగానే ఉంటాయి. ప్రస్తుతం ఫాంలో లేకున్నా అతను అత్యుత్తమ క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 


ప్రస్తుతం విరాట్ వయసు 32 ఏళ్లు. అతను కొట్టే క్రికెటింగ్ షాట్లు, వికెట్ల మధ్య పరిగెత్తే వేగం చూస్తే ఆ వయసు కనిపించదు. గత మూడేళ్లుగా బ్యాటింగ్ లో సరిగ్గా రాణించనప్పటికీ అతని ఫిట్ నెస్ లో మాత్రం తేడా లేదు. ఫీల్డింగ్ లో కానీ, వికెట్ల మధ్య పరిగెత్తడంలో యంగ్ కోహ్లీ లానే ఉంటాడు. గంటలు గంటలు ప్రాక్టీస్ చేసినా అలసిపోయినట్లు అనిపించడు. మైదానంలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. అతని బాడీ కూడా సిక్స్ ప్యాక్ తో ఉంటుంది. ఇదెలా సాధ్యమైందో తెలుసా..


జిమ్ లో కసరత్తులు చేయడం ఒక్కటే కాదు.. పర్ ఫెక్ట్ డైట్ పాటించడంతోనే తానిలా ఉండగలుగుతున్నానంటూ కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. ఫిట్ నెస్ కోసం తనకెంతో ఇష్టమైన బటర్ చికెన్, పరోటాను దూరంగా పెట్టాడు. జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్లడు. పాలు, పాల పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంటాడు. అతను రోజూ తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పు, రోటీ, గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పాలకూర, క్వినోవా వంటి ఆహార పదార్థాలను భాగం చేసుకుంటాడు. అయితే ఏవి తిన్నా సరైన మోతాదులోనే తీసుకుంటాడు. కొవ్వును పెంచే వాటిని దగ్గరకు రానీయడు. 


ఇవే కోహ్లీ ఫిట్ నెస్ రహస్యాలు.